నందమూరి తారకరామారావు అప్పట్లో ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అతడు చెప్పే డైలాగ్ డెలివరీ కూడా ఎవరికీ సాధ్యపడదు అన్నట్లుగా ఉంటుంది. ఎన్టీఆర్ చేయని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు. సినిమాల్లో ఎంతో గొప్ప నటుడిగా.. అగ్రహీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటన అంటే ఏంటో.. ఎక్కడ నుంచి నేర్చుకోవాలో కూడా అతడి నుంచే చాలామంది నేర్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్థాపించారు.
ఒక సినీ నటుడిని ఆదరించి తెలుగు ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు. పార్టీ పెట్టిన కేవలం తొమ్మిది నెలలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపిన ఏకైక వ్యక్తిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి వారసుడిగా వచ్చిన నందమూరి హరికృష్ట సినిమాల్లోకి వచ్చినా అంతగా పాపులర్ మాత్రం కాలేకపోయారు. మరో కుమారుడు నందమూరి బాలకృష్ట మాత్రం ఎన్టీఆర్ వారసత్వాన్ని పుచ్చుకున్నట్లు నటనలో ఒదిగిపోయారు. తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. యువరత్న బాలకృష్ట కు 1982 లో వసుంధరాదేవితో వివాహం జరిగింది. అయితే ఆమె ఎవరి కూతురు అనేది చాలా మందికి తెలియదు. వసుంధరా దేవి.. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యారావు గారి అమ్మాయి. ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు కూడా.
డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె బాలకృష్టను పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లకు బ్రాహ్మణి, తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. తేజస్విని కూడా వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీభరత్ కు ఇచ్చి పెళ్లి చేశారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…