Categories: FeaturedMovie News

అవకాశాలు లేక రాశీ ఇటువంటివి కూడా చేస్తుందా?!

టాలీవుడ్ లో సినిమా ఛాన్స్ ల కోసం హీరోయిన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఒక హిట్ రాగానే తెలుగులో నిలబడాలని భావిస్తూ వచ్చిన ఛాన్స్ లను వదులుకోవడం లేదు. అయితే కొంత మంది
హీరోయిన్ లు నిలబడినట్టే నిలబడి ఆ తర్వాత నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా టాలీవుడ్ అందాల తార రాశీఖన్నా నే చెప్పవచ్చు. తెలుగులో దాదాపు ఆరేళ్ళ నుంచి నిలబడిన రాశీ ఖన్నా మాత్రం ఇంతవరకూ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంది. నటన ఉంది, అందం ఉంది. అయినా సరే ఆమెను మాత్రం విజయం వరించడం లేదు.

ఈమధ్యనే ‘ప్రతిరోజు పండగే’ లో సాయి ధరమ్ తేజ్ తో నటించింది రాశీ.. ఆ సినిమా మంచి హిట్ అయింది. దీనితో నిలబడింది అనుకున్నారు. కాని వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫ్లాప్ కావడంతో రాశీఖన్నా కధ మళ్ళీ మొదటికొచ్చింది. గతంలో కూడా ఇలాగే ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుండేది. అలా అని ఆమెకు మంచి మంచి ఛాన్సులే వస్తుండేవి. కాని ఆమె మాత్రం వరుస హిట్ లు సాధించలేకపోతుంది. టాలివుడ్ లో అందరికీ రాశీఖన్నా అంటే మీద సదభిప్రాయమే ఉంది. పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే.. కాలం కలసిరాకపోవడంతో రాశీ మాత్రం ఏదోక సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుతం రాశీ చేతిలో 2,3 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కూడా ఆమెకు హిట్ కొట్టకపోతే ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయమని టాలీవుడ్ మీడియా ప్రతినిధులు అంటున్నారు.

ఇదిలా వుండగా.. టాలీవుడ్‌లో త‌న స్వ‌యంకృషితో ఒక్కొక్క మెట్టు ఎదిగిన న‌టుడు మాస్ మహారాజా ర‌వితేజ కూడా ఈమధ్య వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌వుతున్నాడు. ర‌వితేజ ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్న ‘క్రాక్’ అనే చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ చేయ‌నున్నాడ‌ని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఒక స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేసింద‌ట చిత్ర‌ బృందం. ఈ సాంగ్ కోసం అందాల భామ రాశీఖ‌న్నాను ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. మ‌రి ఛాన్సులు లేక ఇబ్బందులు పడుతున్న రాశీఖ‌న్నా ఈ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago