టాలీవుడ్ లో సినిమా ఛాన్స్ ల కోసం హీరోయిన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఒక హిట్ రాగానే తెలుగులో నిలబడాలని భావిస్తూ వచ్చిన ఛాన్స్ లను వదులుకోవడం లేదు. అయితే కొంత మంది
హీరోయిన్ లు నిలబడినట్టే నిలబడి ఆ తర్వాత నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా టాలీవుడ్ అందాల తార రాశీఖన్నా నే చెప్పవచ్చు. తెలుగులో దాదాపు ఆరేళ్ళ నుంచి నిలబడిన రాశీ ఖన్నా మాత్రం ఇంతవరకూ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంది. నటన ఉంది, అందం ఉంది. అయినా సరే ఆమెను మాత్రం విజయం వరించడం లేదు.

ఈమధ్యనే ‘ప్రతిరోజు పండగే’ లో సాయి ధరమ్ తేజ్ తో నటించింది రాశీ.. ఆ సినిమా మంచి హిట్ అయింది. దీనితో నిలబడింది అనుకున్నారు. కాని వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫ్లాప్ కావడంతో రాశీఖన్నా కధ మళ్ళీ మొదటికొచ్చింది. గతంలో కూడా ఇలాగే ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుండేది. అలా అని ఆమెకు మంచి మంచి ఛాన్సులే వస్తుండేవి. కాని ఆమె మాత్రం వరుస హిట్ లు సాధించలేకపోతుంది. టాలివుడ్ లో అందరికీ రాశీఖన్నా అంటే మీద సదభిప్రాయమే ఉంది. పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే.. కాలం కలసిరాకపోవడంతో రాశీ మాత్రం ఏదోక సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుతం రాశీ చేతిలో 2,3 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కూడా ఆమెకు హిట్ కొట్టకపోతే ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయమని టాలీవుడ్ మీడియా ప్రతినిధులు అంటున్నారు.

ఇదిలా వుండగా.. టాలీవుడ్‌లో తన స్వయంకృషితో ఒక్కొక్క మెట్టు ఎదిగిన నటుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఈమధ్య వరుస ప్లాపులతో సతమవుతున్నాడు. రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్వకత్వం వహిస్తున్న ‘క్రాక్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసిందట చిత్ర బృందం. ఈ సాంగ్ కోసం అందాల భామ రాశీఖన్నాను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి ఛాన్సులు లేక ఇబ్బందులు పడుతున్న రాశీఖన్నా ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.



























