Categories: FeaturedMovie News

ఆ రోజు ఆ హీరో హెల్ప్ చేసుండకపోతే ఈరోజు నేనిలా బ్రతికుండేదాన్ని కాదంటున్న నటి సుధ (టాలీవుడ్ అమ్మను కాపాడిన ఆ హీరో ఎవరు.?)

తెలుగు చలనచిత్రసీమలో అమ్మ పాత్రలంటే వెంటనే గుర్తొచ్చే నటి సుధ.
టాలీవుడ్ లో అమ్మ పాత్ర నుండి వదిన, అక్క వంటి కుటుంబ విలువలను తెలియజెప్పే వైవిధ్యమైన పాత్రలను పోషించగల లేడీ ఆర్టిస్ట్ గా సీనియర్ నటి సుధకు మంచి గుర్తింపు వుంది. ఇప్పటివరకూ సుమారు 750 కి పైగా చిత్రాలలో నటించిన సుధ గ్యాంగ్ లీడర్, ఆమె, అతడు, బాద్ షా వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే సుధను టాలీవుడ్ అమ్మ అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. గత 40 ఏళ్లుగా సినీ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పర్చుకున్న నటి సుధ కొన్ని కారణాల వల్ల మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు. కానీ ఈమధ్యనే ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

అలనాటి ప్రముఖ దర్శకుడు బాలచందర్ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన సుధ ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఫ్లాఫ్ కావడంతో ఒకరోజు బాలచందర్ వచ్చి హీరోయిన్‌గా స్థిరపడేందుకు కావాల్సిన అర్హతలు నీకులేవు. నీవు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారితేనే ఎక్కువ కాలం సినిమా రంగంలో స్ధిరపడగలవు అని చెప్పడంతో ఆ సీనియర్ దర్శకుని సూచన మేరకు అప్పట్నుంచి అమ్మ, వదిన, అక్క పాత్రలు ధరించడం ప్రారంభించింది సుధ. గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆమె ధరించిన వదిన పాత్రకు విశేషాదరణ లభించడంతో ఆ తర్వాత సుధ కుటుంబ తరహా పాత్రలతో చాలా బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో సుధకు నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలతో మంచి అనుబంధమే ఉంది. జగపతిబాబు అంటే కూడా సుధకు చాలా ఇష్టమని ఇంటర్వ్యూ లో చెబుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలియజేశారు.

అదేమిటంటే.. ఈ రోజు సుధ ఇంకా ఇలా బతికి ఉన్నారంటే అందుకు కారణం నాగార్జున గారేనంట.. వివరాల్లోకి వెళ్తే.. ప్రెశిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్ లో నటిస్తున్నప్పుడు సుధ అపెండిసైటిస్‌తో బాధపడుతూ సృహతప్పి పడిపోతే నాగార్జున గారు వెంటనే స్పందించి ఆమెను హాస్పిటల్‌కు పంపించి ఆపరేషన్ చేయించారంట. అలా ఆరోజు నాగార్జున గారు హెల్ప్ చేసుండకపోతే సుధ బతికి ఉండేది కాదని, అందుకే ఈరోజుకీ తను భూమ్మిద ఇలా ఉందంటే అందుకు కారణం నాగార్జున గారు మాత్రమే అని, అందుకే నాగార్జున అంటే చాలా ఇష్టమని సుధ తెలియజేశారు. ఇలాంటి సంఘటనే మరోసారి జరిగిందని వివరిస్తూ.. రావోయి చందమామ సినిమా షూటింగ్ లో సుధ గాయపడిందట. ఆమె శరీరంలోని ఓ భాగం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆమెను మంచం పైనే పడుకోబెట్టారు. వెంటనే నాగార్జున గారు స్పందించి తన పర్సనల్ డాక్టర్ ని పిలిపించడంతో పెద్ద ప్రమాదం నుండి బయట పడినట్టు సుధ వెల్లడించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago