దక్షణ భారత్ లో గ్లామర్‌కే గ్రామర్ నేర్పిన లేడీశ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకోసం ప్రేక్షకులకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
విజయశాంతి టాలీవుడ్ లోకి ఎంటర్ కాకముందు సినిమా కధలన్నీ హీరో చుట్టూనే తిరుగుతుండేవి. అప్పట్లో ఏడాదికి ఒకటో.. రెండో లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదలయ్యేవి. కానీ అసలు సిసలైన లేడీ ఓరియెంటెడ్ సినిమా కధలు ఎలా వుంటాయో తాను నటించిన చిత్రాలతో నిరూపించింది మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌కి కొత్త రూపు తీసుకువచ్చిన ఘనత ఈ లేడీ సూపర్ స్టార్‌కే దక్కుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అత్యధిక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసిన విజయశాంతి తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సుమారు 180కి పైగా సినిమాలలో నటించింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈమెతో నటించడానికి ఉత్సాహం చూపించేవారంటే విజయశాంతికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి హిట్ కాంబినేషన్‌లో 19 చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి నందమూరి బాలకృష్ణతో 17 చిత్రాల్లో నటించింది. ఇక విజయశాంతి వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలియవు. గత సంవత్సరం రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో నటించారు విజయశాంతి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..
1966 జూన్ 24న వరంగల్‌లో జన్మించిన విజయశాంతి.. తన పిన్ని విజయలలిత వారసత్వం కారణంగా ఏడేళ్ల వయసులోనే బాల నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో కధానాయికగా నటించిన విజయశాంతి ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 1991లో ‘కర్తవ్యం’ సినిమాలో ఆమె నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి గా పురస్కారాన్ని అందుకున్న విజయశాంతి తన 17 ఏళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే తల్లి కూడా పోగొట్టుకుంది. తను జీవితంలో ఇలా అష్ట కష్టాలు పడుతున్న సమయంలో దైవమిచ్చిన భర్త శ్రీనివాస ప్రసాద్ అని, తనకు బాగా గుర్తింపును తీసుకొచ్చిన ‘కర్తవ్యం’ సినిమా నిర్మాత అతనేనని, అతనితో తన పెళ్ళై నేటికి 32 ఏళ్లయిందని.. 1988, మార్చ్ 29న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నామంటూ మరికొన్ని సంచలన విషయాలను మీడియా ప్రతినిధులతో పంచుకుంది మన లేడీ సూపర్ స్టార్.
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి ఒక్కసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినీ రంగానికి దూరమయ్యారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమా ఆమె హీరోయిన్ గా నటించిన ఆఖరు చిత్రం. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తల్లి పాత్రలో కనిపించారు. మొత్తానికి చాలా సంవత్సరాల తరువాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ తరువాత సినిమాలపై మక్కువ చూపించడం లేదు. అభిమానుల కోరిక మేరకు ఆమె మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…