సిమ్లా లోని కులు జిల్లా పోలీసు సిబ్బంది మరియు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అది కాస్త పెద్దదై చివరకు కొట్టుకునేంత వరకు వెళ్ళింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్య మంత్రి జైరాం ఠాకూర్ పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఈ నేపధ్యంలో ఈ ఘటన జరిగినట్టు సిమ్లా పోలీసు కార్యాలయం ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. విమానాశ్రయం బయట ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు గుమికూడారు. అయితే ఈ విషయంపై సీఎం జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్‌ను.. కులు ఎస్పీ గౌరవ్ సింగ్ ముందుగా చెంప మీద కొట్టాడు. కులు ఎస్పీ చేయిచేసుకోవడంతో కోపంతో ఊగిపోయిన సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ బల్వంత్ సింగ్ కాలితో ఎస్పీ గౌరవ్ సింగ్‌ని తన్నారు. అయితే ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు అధికారులను విచారిస్తున్నారు. ప్రస్తుతం విచారణ ముగిసే వరకు వీరిని సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…