Tolly wood Actresses: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మంచి మంచి అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఇలా హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో విలన్ గా ఏకంగా రజనీకాంత్ తో పోటీపడ్డారు. ఇలా నీలాంబరి పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే కనుమరుగయ్యారు నటి సౌందర్య. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సౌందర్య కూడా శ్రీకాంత్ రిచా కలిసి నటించిన నా మనసిస్తారా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ తో కలిసి విలన్ పాత్ర ద్వారా మెప్పించారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల ద్వారా నటించింది మెప్పించారు. ఇక ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…