Categories: FeaturedMovie News

టాలీవుడ్ మూవీ మొగల్ కు దొరికిన బంగారు బాతు ‘ప్రేమ నగర్’ వెనుక ఇంత కధ వుందా.?

తాజ్‌మహల్ సమాధికి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర సీమలో “ప్రేమనగర్” చిత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సురేష్ ప్రొడక్షన్స్‌ లో తన జీవితం తాడోపేడో తేల్చుకుందామని ప్రముఖ నిర్మాత రామానాయుడు తన చివరి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమిది. అప్పట్లో రచయి(త్రి)తలు రాసిన సూపర్ హిట్ నవలలను సినిమాలుగా నిర్మిస్తున్న కాలం అది. ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యా దేవి రచించిన “విరచిత” నవలకు ప్రతిరూపమే ఈ “ప్రేమనగర్” చిత్రం.

ఆ రోజుల్లో ఎందరో నిర్మాతలు, దర్శకులు ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నించినా ఎందుకనో ధైర్యం చేయలేకపోయారు. కానీ ఈ నవలను చదివిన రామానాయుడు, అప్పటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ఆ నవల కోసం చెప్పడంతో ఆయన బాగుందని, అందులోని కళ్యాణ్ పాత్ర నచ్చిందని చెప్పడంతో ఆ పాత్రను అక్కినేని నాగేశ్వరరావుతోనే చేయించారు రామానాయుడు. 1971 లో ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్‌ జరిగే టైంలో వాహిని స్టూడియో అంతా కిటకిటలాడిపోయింది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేష సంఘటన ఏమిటంటే.? అక్కినేనికి రామా నాయుడు మీద ఉండే అభిమానంతో వారి మాటను కాదనలేక దేవుడికి కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ సరిగ్గా 2 భాగాలుగా పగలడంతో అక్కడున్న వాళ్ళందరూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారట. దేవుడి పటాలకు కొబ్బరికాయ కొట్టడం అదే మొదటిసారి. అదే ఆఖరిసారి అని అక్కినేని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

ఇక ఈ చిత్రం వెనుక దాగివున్న రహస్యాల వివరాల్లోకి వెళ్తే.. 1971లో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ‘ప్రేమ నగర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రం విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుంది. అదేమిటంటే.. ఈ చిత్ర నిర్మాణానికి ముందు ఆ టైంలో ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యదేవి ‘విరచిత’ పేరుతో రాసిన నవల అద్భుతంగా పాఠకుల ప్రశంసలను అందుకుంది. ఆ సంగతి తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత ANR హీరోగా ఈ కధను సినిమాగా తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుని ఆ రచయిత్రి వద్ద నవల కాపీరైట్స్ ను కొనేశారు. ఆ తర్వాత ఆ నవల ఆధారంగా సినిమా
స్క్రిప్ట్ సిద్ధం చేయించి అక్కినేనికి ఇచ్చారు. స్వతహాగా ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాటు లేని ANR ఆ సినిమా స్క్రిప్ట్ ను చదవమని శ్రీమతి అన్నపూర్ణగారికి ఇచ్చారు. ఆవిడ ఆ స్క్రిప్ట్ ను మొత్తం చదివి దేవదాసులో లేని కమర్షియల్ అంశాలు ఇందులో చాలా ఉన్నాయని ఈ నవలను సినిమాగా తీసి.. అందులో ANR హీరోగా నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతమౌతుందని జోస్యం చెప్పారు. అంతే.. వెంటనే అన్నపూర్ణ గారి మాట విన్న ANR ఆ సినిమా ప్రాజెక్ట్ ను ఓకే చేసేశారు.

హీరోయిన్ గా ముందు KR విజయ ను ఫిక్స్ చేశారు. హీరోయిన్ పాత్ర కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు కారు ప్రయాణం చేస్తుండగా దారి మధ్యలో శ్రీధర్ రెడ్డి కారు అనుకోకుండా యాక్సిడెంట్ కు గురైంది. ఊహించని ఆ సంఘటనతో ఇదేదో అపశకునంలా భావించిన శ్రీధర్ రెడ్డి భార్య ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనను విరమించుకున్నారు. అయితే కథలో బలం తెలిసిన అక్కినేని దీన్ని ఎలాగైనా కొనుక్కోమని రామానాయుడు గారికి రికమండ్ చేశారు. హీరోయే స్వయంగా అంత నమ్మకంతో చెబుతుంటే ఎవరైనా కాదంటారా.? అక్కినేని మాట కాదనకుండా వెంటనే ఆ నవల కాపీరైట్స్ ను శ్రీధర్ దగ్గర్నుండి కొనేశారు రామా నాయుడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా రాఘవేంద్రరావు గారి తండ్రి K.s ప్రకాష్ రావు గారిని తీసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా జరిగాయి. హీరోయిన్ KR విజయ స్థానంలోకి వాణిశ్రీ వచ్చింది. అప్పట్లోనే 15 లక్షల బడ్జెట్ తో రామా నాయుడు గారు ‘ప్రేమ నగర్’ ని భారీగా నిర్మించారు. 34 ప్రింట్లతో విడుదల చేస్తే ఊహించని విధంగా 50 లక్షలు వసూలు చేసిందీ బ్లాక్ బస్టర్ మూవీ.

గమ్మత్తేమిటంటే.. ఈ చిత్రం విడుదలైన 15రోజులు భారీ వర్షాలు పడుతున్నా సరే.. ప్రేక్షకులు ఆ వర్షాలను లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని తండోప తండాలుగా వచ్చి మరీ సినిమా చూశారు. Kv మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ సంభాషణలు, వెంకట రత్నం ఛాయాగ్రహణం అన్ని కలిసి ఈ చిత్రాన్ని ఓ అద్భుత దృశ్యకావ్యంలా మలిచాయి. గుమ్మడి, శాంతకుమారి, కైకాల సత్య నారాయణ, వరలక్ష్మి, రాజబాబు, ధూళిపాల లాంటి ఎందరో ప్రముఖ నటీనటులు తమ నటనా చాతుర్యం చూపించి ఈ చిత్ర విజయంలో భాగస్వాములయ్యారు. ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా రామానాయుడు గారే రీమేక్ చేశారు. తమిళంలో కూడా హీరోయిన్ గా వాణిశ్రీనే ఎంచుకున్నారు. ఇక బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా, హేమమాలినిలతో తీస్తే అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది ప్రేమ నగర్. ఈవిధంగా శ్రీధర్ రెడ్డి, K.R విజయల చేయి జారిన అదృష్టం.. రామా నాయుడు, వాణిశ్రీలకు అద్భుతంగా కలిసొచ్చింది. సురేష్ బ్యానర్ విలువ “ప్రేమ నగర్” దెబ్బకు రెట్టింపయ్యింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago