Tollywood Stars: ఖరీదైన,లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..!
Tollywood Stars: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారి జీవితం కూడా ఎంతో ఆనందంగా సాగిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొని హీరోలు వారి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి ఒక్క వస్తువు ఎంతో ఖరీదైనదిగా ఉండేలా చూసుకుంటారు. ఈక్రమంలోనే ఖరీదైన కార్లు బంగ్లాలు వంటివి స్టార్ హీరోలకు ఉండడం సర్వసాధారణం.
ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొందరు నిత్యం సినిమా షూటింగులకు తీరికలేకుండా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఈ క్రమంలోనే అందరు కూడా సొంతంగా ఒక ఖరీదైన, లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఏ హీరోలు సొంత విమానాలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కుటుంబంగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపార రంగంలో ఉన్న మెగా కుటుంబానికి సొంత విమానం ఉంది.ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ విజయవాడ వెళ్ళడం కోసం సొంతంగా ఒక ఫ్లైట్ కొనుగోలు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా సొంత విమానం ఉంది. ఈయన తన కుటుంబంతో కలిసి విదేశీ ప్రయాణాలు చేయాలంటే ఇందులోనే ప్రయాణం చేస్తారు. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ కూడా ఒక సొంత విమానం ఉంది.ఇక పాన్ ఇండియా హీరోగా ఎంతో గుర్తింపు పొందిన ప్రభాస్ వరుస షూటింగ్ ల నిమిత్తం ముంబై హైదరాబాద్ ఇతర దేశాలకు ప్రయాణం చేయాల్సి రావడంతో ఈయన కూడా ఒక ఖరీదైన విమానం కొన్నారు. ఇక మహేష్ బాబుకి కూడా ఒక సొంత విమానం కొనుగోలు చేశారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సినిమారంగంలోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్న అక్కినేని కుటుంబానికి కూడా ఓ విమానం ఉంది.ఇక ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సైతం ఒక సొంత విమానం ఉండడం విశేషం.ఈయన కన్నా ఇండస్ట్రీలోకి ముందుగా వచ్చిన నాని శర్వానంద్ వంటి హీరోలు ఎంతో మంది ఉన్నారు .అయితే ఇప్పటివరకు వారెవరికీ విమానాలు లేవు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…