Featured

హాస్య నటుడు ఐరన్ లెగ్ శాస్త్రి చనిపోతే రిక్షాలో పడేసి లాక్కెళ్లారు! అయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలిస్తే కన్నీల్లోస్తాయి..

గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఐరన్ లెగ్ శాస్త్రి అంటే తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచితులు. అవును.. 150 పైగా వెండితెరపై తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. టాలీవుడ్ దర్శకుడు కీర్తిశేషులు ఈవీవీ సత్యనారాయణ గారు తెరకెక్కించిన అప్పుల అప్పారావు చిత్రంతో విశ్వనాథశాస్త్రి వెండితెరకు పరిచయమయ్యారు. ఈయన తనదైన భారీ ఆకారంతో అలాగే అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వెండితెరపై ఒకానొక సమయంలో బాగానే పేరుపొందాడు.

ఈయన ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంకు శిష్యుడిగా అనేక సినిమాలలో నటించారు. ఆయనతో కలిసి నటించిన అనేక సినిమాలలో సంబంధించిన కామెడీ సీన్స్ ఇప్పటికి ఎవరు మర్చిపోరు. ఇప్పుడు కూడా ఆ సీన్లు టీవీ లో వస్తే ఛానల్ మార్చకుండా వాటినే చూస్తూ తెగ నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే విశ్వనాధశాస్త్రి సినిమాల్లోకి రాక ముందు ఆయన పౌరోహిత్యం చేసేవారు. ఐరన్ లెగ్ గా మొదటగా ఆయనను ఈవీవీ సత్యనారాయణ సిరి ఇండస్ట్రీకి పరిచయం చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈయన అప్పుల అప్పారావు సినిమా ద్వారా పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత ప్రేమఖైదీ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడ మా ఆవిడ, పేకాట పాపారావు మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆదాయం ఎక్కువవడంతో తాను చేస్తున్న పురోహితంని పూర్తిగా మర్చిపోయి సినిమాల్లోనే స్థిరపడి పోయాడు. అయితే సినిమాల్లో ఆదాయం ఎక్కువగా లభించడంతో ఆ సమయంలో ఆయన తాగుడుకు బానిస అయ్యారు. తాగుడుకు బానిస అవ్వడంతో చివరికి ఆయనను సినిమా అవకాశాలు కూడా రాకపోయాయి. దీంతో ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమా అవకాశాలు లేక, తన పాత వృత్తి పురోహితం వైపు తిరిగి వెళ్లాలి అనుకున్నప్పటికీ తనను వెండి తెరపై చూపించే ఐరన్ లెగ్ పేరు కి తన జీవితం లో మళ్లీ పురోహిత వైపు అవకాశం దొరకలేదు. తన స్క్రీన్ నేమ్ అతనికి ఉపాధి కరువయ్యేలా చేసిందట. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని విశ్వనాథశాస్త్రి తెలిపారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రకు ఎక్కువగా దురదృష్టానికి, దరిద్రానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించే వారు. నిజానికి ఆ పాత్ర కేవలం సినిమా తెరపై మాత్రమే అయినప్పటికీ ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితానికి బాగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పురోహితం చేసుకుని పొట్ట పోసుకుందాం అనుకున్నప్పటికీ ఆయన సినిమాల్లో సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎవరూ ఆయనకు శుభకార్యాలకు పిలిచేవారు కాదు.

అంతేకాదు సినీ పరిశ్రమలో కూడా ఏవైనా సినిమాకు సంబంధించి శుభకార్యాలు జరుగుతున్న సమయంలో కూడా ఆయన్ని అటువైపు కూడా కాలు పెట్టినవ్వలేదు. దీంతో ఆయన పరిస్థితి చివరిలో చాలా ఘోరంగా మారింది. బయట చేసుకోవడానికి పురోహితం ఛాన్స్ లేక అలాగే సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఎవరిని పడితే వారిని డబ్బులు అడగడం పరిపాటిగా మారిపోయింది. అంతే కాకుండా ఆయన మందుకు పూర్తిగా అలవాటు పడడంతో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన మీడియా పూర్వకంగా అడిగారు. దీంతో కొంతమంది సినీ వర్గానికి చెందిన వారు ఆయనకు కాసింత ఆర్థిక సహాయం అందించిన అది పూర్తిగా ఆయన కష్టాల్లో నుంచి బయటికి వెళ్లేలా చేయలేదు. చివరికి ఆయన ప్రతిభ ఆయన కు శాపంగా మారింది.

ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో శాస్త్రి తన స్వగ్రామం తాడేపల్లిగూడెం వెళ్లిపోయాడు. ఓవైపు సినిమా అవకాశాలు లేక, మరోవైపు పౌరోహిత్యానికి ఎవరూ పిలవక దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. చివరికి శరీరం భారీగా పెరిగిపోయి పచ్చకామెర్ల వ్యాధితో మంచం పట్టాడు. ఆ సమయంలో భార్యాబిడ్డలు హైదరాబాద్ లో ఉంటే గుండెపోటు వచ్చిందని ఐరన్ లెగ్ శాస్త్రిని అయన బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే భార్య, కొడుకు వచ్చేసరికి ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆయన 2006 జూన్ 19న తాడేపల్లిగూడెంలో మరణించారు.

అయితే ఐరన్ లెగ్ శాస్త్రి దేహాన్ని ఓ రిక్షాలో పడేసిన వైనం చూసి భార్య కళ్లు తిరిగి కిందపడిపోయిందట. ట్రైన్ దిగి నేరుగా ఆసుపత్రికి వెళుతున్న ఆయన భార్య, కుమారుడికి ఓ రిక్షాలో ఆయన దేహం ఎదురొచ్చింది. ఆ సమయంలో తన తండ్రి శరీరం సగమే రిక్షాలో ఉందని, కాళ్లు చేతులు రిక్షా బయటికి వేలాడుతూ ఉన్నాయని, ఆ స్థితిలోనే ఆయన్ను రిక్షాల్లో లాక్కెళ్లడం చూసి తన తల్లి తట్టుకోలేపోయిందని ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago