ఎన్ని సంవత్సరాలు గడిచిన గాని కొంతమంది ఆర్టిస్టులు మాత్రం చిరకాలం గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే గొప్ప నటులలో అచ్యుత్ కూడా ఒకడు. సినీ రంగంలోనూ, బుల్లితెరలోను తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పట్లో బుల్లితెరలో స్టార్ నటుడిగా ఒకే వెలుగు వెలిగాడు అచ్యుత్. నటుడిగా సీనియర్ హీరోల తోటి, స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో అందరితోనూ నటించాడు అచ్యుత్. కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి చూపేవాడు అచ్యుత్.
ఆ ఆసక్తితోనే మొదటగా బుల్లితెరలో నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తరువాత 1989 లో ఆదివారం అమావాస్య అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇంకా ఆ సినిమా అచ్యుత్ కి మంచి పేరుని, గుర్తింపును తెచ్చి పెట్టింది. అలా సపోర్టింగ్ యాక్టర్ గా మొదలయిన ఆయన ప్రయాణం ప్రేమ ఎంత మధురం, స్వాతి కిరణం, అక్క మొగుడు, తాజ్ మహల్ ఇలా చాలా సినిమాల్లో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.
అసలు అచ్యుత్ సినిమాల్లోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవినే ప్రధాన కారణం అంట. అచ్యుత్ మొదట నుంచి మెగాస్టార్ అభిమాని. అలా మొదట నుంచి చిరంజీవి సినిమాలు చూసి ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాడట. అలా ఎన్నో కష్ట నష్టపడి, వాటిని ఓర్చుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ఆయన ఎంతగానో అభిమానించే చిరంజీవితో నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయనాని ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా దాదాపు 50 సినిమాల దాక నటించాడు. అచ్యుత్ మంచి అందగాడు కూడా.బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించాడు. హిమాభిందు, అన్వేషిత, అంతరంగాలు, ప్రతి బంధాలు వంటి సీరియల్స్ మంచి గుర్తింపునిచ్చాయి. 1989 నుంచి 2002 వరకు సినీ రంగాన్ని, బుల్లితెరని ఒక ఊపు ఊపేసాడు.
కెరీర్ మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. బిజినెస్ మాన్ గా ఎదగాలని 40 లక్షలు దాక పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయిపోయాడు. ఒకానొక సమయంలో మానసిక వేదనతోను అప్పుల ఒత్తిడి వలన 2002 డిసెంబర్ 26 న గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా అందరిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంకా అచ్యుత్ వ్యక్తిగత విషయానికి వస్తే అచ్యుత్ మచిలీపట్నంకి చెందినవాడు. తండ్రి పేరు రామారావు.. తల్లి పేరు సుజాత. అచ్యుత్ కి ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇతని అసలు పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. ఇతని భార్య పేరు రమాదేవి. అచ్యుత్ కి ఇద్దరు కూతుళ్లు. వాళ్ళ పేర్లు సాయి శివాని, సాయి సుజాత. ఈయన కూతుళ్లు ఇద్దరు ఉన్నత చదువులు చదువుకుని బాగా సెటిల్ అయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…