ఎన్ని సంవత్సరాలు గడిచిన గాని కొంతమంది ఆర్టిస్టులు మాత్రం చిరకాలం గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే గొప్ప నటులలో అచ్యుత్ కూడా ఒకడు. సినీ రంగంలోనూ, బుల్లితెరలోను తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పట్లో బుల్లితెరలో స్టార్ నటుడిగా ఒకే వెలుగు వెలిగాడు అచ్యుత్. నటుడిగా సీనియర్ హీరోల తోటి, స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో అందరితోనూ నటించాడు అచ్యుత్. కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి చూపేవాడు అచ్యుత్.

ఆ ఆసక్తితోనే మొదటగా బుల్లితెరలో నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తరువాత 1989 లో ఆదివారం అమావాస్య అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇంకా ఆ సినిమా అచ్యుత్ కి మంచి పేరుని, గుర్తింపును తెచ్చి పెట్టింది. అలా సపోర్టింగ్ యాక్టర్ గా మొదలయిన ఆయన ప్రయాణం ప్రేమ ఎంత మధురం, స్వాతి కిరణం, అక్క మొగుడు, తాజ్ మహల్ ఇలా చాలా సినిమాల్లో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.

అసలు అచ్యుత్ సినిమాల్లోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవినే ప్రధాన కారణం అంట. అచ్యుత్ మొదట నుంచి మెగాస్టార్ అభిమాని. అలా మొదట నుంచి చిరంజీవి సినిమాలు చూసి ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాడట. అలా ఎన్నో కష్ట నష్టపడి, వాటిని ఓర్చుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ఆయన ఎంతగానో అభిమానించే చిరంజీవితో నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయనాని ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా దాదాపు 50 సినిమాల దాక నటించాడు. అచ్యుత్ మంచి అందగాడు కూడా.బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించాడు. హిమాభిందు, అన్వేషిత, అంతరంగాలు, ప్రతి బంధాలు వంటి సీరియల్స్ మంచి గుర్తింపునిచ్చాయి. 1989 నుంచి 2002 వరకు సినీ రంగాన్ని, బుల్లితెరని ఒక ఊపు ఊపేసాడు.

కెరీర్ మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. బిజినెస్ మాన్ గా ఎదగాలని 40 లక్షలు దాక పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయిపోయాడు. ఒకానొక సమయంలో మానసిక వేదనతోను అప్పుల ఒత్తిడి వలన 2002 డిసెంబర్ 26 న గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా అందరిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంకా అచ్యుత్ వ్యక్తిగత విషయానికి వస్తే అచ్యుత్ మచిలీపట్నంకి చెందినవాడు. తండ్రి పేరు రామారావు.. తల్లి పేరు సుజాత. అచ్యుత్ కి ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇతని అసలు పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. ఇతని భార్య పేరు రమాదేవి. అచ్యుత్ కి ఇద్దరు కూతుళ్లు. వాళ్ళ పేర్లు సాయి శివాని, సాయి సుజాత. ఈయన కూతుళ్లు ఇద్దరు ఉన్నత చదువులు చదువుకుని బాగా సెటిల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here