సమంత, నాగచైతన్య విడాకుల విషయంపై నేడు వాళ్లిద్దరు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము ఇక ఎవరిదారి వారు చూసుకుంటామని.. భర్యాభర్తలుగా విడిపోయినా.. తాము స్నేహితులమే అంటూ చెప్పారు. ఇదిలా ఉండగా.. వాళ్ల విడాకుల విషయమై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి.. అటు రాజకీయాలకు సంబంధించి ఏ విషయాలను అయినా సోషల్ మీడియాలో తమ అభిమానులకు పంచుకుంటాడు. ప్రస్తుతం సమంత, చైతూ విడాకుల విషయంపై కూడా పరోక్షంగా ఓ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అందేంటంటే.. తన పాఠశాలలో మొదట నేర్చుకున్న పాఠం ఏంటంటే ‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు’ మీ సంగతేంటి ..? అంటూ ప్రశ్నార్థకం పెట్టాడు.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అతడు ఎవరిని గురించి పోస్టు పెట్టాడో చాలామందికి తెలవడం లేదు.. ప్రస్తుతం సమంత విడాకులు తీసుకుంది కావునా.. ఆమె గురించే ఈ పోస్టు పెట్టినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే మొదట్లో సమంత-సిద్దార్థ్ డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఉండేవారు. వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని సిద్దార్థ్ ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
దీంతో ప్రస్తుత సమయంలో అలాంటి పోస్టు అవసరమా అంటూ తిట్టి పోస్తున్నారు. ఇదిలా ఉండగా..
టాలీవుడ్ లో మొదట అతడు ఎన్నో సినిమాలు చేశాడు. తర్వాత ఎక్కవగా అవకాశాలు రాలేదు. వెంటనే అతడు కోలీవుడ్ బాట పడ్డాడు. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే అతడు ఈ మధ్య ‘గృహం’ అనే సినిమా చేశాడు.. దీనికి మంచి పేరు రావడంతో మళ్లీ.. మళ్లీ తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…