Movie News

కొండపొలం సినిమాపై పవన్ మామ ఇలా అన్నాడు.. హీరో వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతోనే తనకున్న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దీని తర్వాత అతడు వెంటనే ఒప్పుకున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ సినిమా.

దీనిని ప్రముఖ దర్శకుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. దీనిని సన్నపురెడ్డి వెంట రామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ చిత్రంగా దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఈ సినమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉండగా.. వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలోని ‘నీ కళ్లు నీలి సముద్రం’అనే సాంగ్ లో తాను చేసిన నటనకు మెచ్చి తనకు ఈ అవకాశాన్ని దర్శకుడు ఇచ్చాడని అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కథను తాను మొదట విన్నానని.. దానిని తన మామ అయిన పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పానని.. అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తాను కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి వహిస్తున్నాడు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ క‌నిపించ‌నున్నాడు. అడవికి వెళ్లి అక్కడ తన కుటుంబాన్ని , తన గొర్రెలను క్రూరమైన జంతువుల నుంచి ఎలా కపాడుతాడనేది ఈ సినిమా అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago