సమంత నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి మనకు తెలిసిందే.ఏం మాయ చేసావే సినిమా ద్వారా పరిచయమైన వీరు ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల నుంచి పరిచయమున్న వీరు 2017 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా కలిసి నటించిన ఈ జంట వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకుంది.
ఇలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ ఈ జంట గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో అందంగా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేస్తూ సినిమాలు తీయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదని ఈ క్రమంలోనే తనని సినిమాలు చేయవద్దని చెప్పడంతోనే సమంతకు నాగచైతన్యకు మధ్య వివాదాలు ఏర్పడ్డాయని అందుకే విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇలా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వారికి ప్రేమకు గుర్తుగా వారి చేతుల పై టాటూలను వేయించుకున్నారు. చైతుతో ఉన్న బంధం తనకు జీవితాంతం గుర్తు ఉండే విధంగా సమంత ఏకంగా తన శరీరంపై మూడు టాటూలను వేయించుకుంది. మొట్టమొదటిసారిగా వీరు కలిసి నటించిన ఏం మాయ చేసావే సినిమా గుర్తుగా సమంత తన మెడ పై YMC అనే టాటూ వేయించుకుంది.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే రకమైన గుర్తును వారి కుడి చేతి పై వేయించుకున్నారు. అలాగే సమంత చైతన్య సంతకాన్ని తన నడుము పై టాటూ వేయించుకుంది.ఈ విధంగా చైతన్య పై ఉన్న ప్రేమను టాటూల రూపంలో తన శరీరంపై పదిలంగా దాచుకున్న సమంత నేడు విడాకులు తీసుకోవడం అభిమానులను ఎంతో కలచివేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…