Tollywood Heroes : సినిమా ఇండస్ట్రీ లో పోటీ ఎంతున్నా స్నేహాలు, ఒకరికోసం ఒకరు సినిమాల్లో నటించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి స్నేహ బంధమే ఉంది. వాళ్ల అభిమానులే ఇంకా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మాట్లాడుతుంటారు. కానీ సూపర్ స్టార్లైనా మామూలు హీరోలైనా ఒక సినిమాకి హైప్ రావాలంటే ప్రొమోషన్స్ చేయాల్సిందే. ఇంతకుముందు అయితే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేసే వారు. ఇపుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అంటూ హడావిడి చేస్తుంటారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అన్న విషయానికే ఫ్యాన్స్, మిగిలిన ఆడియన్స్ ప్రముఖ్యతని ఇస్తున్నారు. అలా ఒక హీరో ఈవెంట్ కి మరో హీరో రావడం ఒక మంచి సంప్రదాయంగా ఇప్పుడు ఇండస్ట్రీ లో కొనసాగుతోంది. మా మధ్య ఎలాంటి వైరం లేదు అభిమానులు కూడా అలానే ఉండండి అంటూ మెసేజ్ ఇస్తున్నారు. ఇక పోతే ఈ ఈవెంట్స్ కి అతిధి గా వచ్చిన హీరో స్పీచ్ ఆ సినిమా హీరో స్పీచ్ నే డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈవెంట్లలో స్పీచ్ తో డామినేట్ చేసిన హీరోలు…
చిరంజీవి.. స్పీచ్ తో మిగిలిన హీరోలను డామినేట్ చేసే హీరో అంటే మొదట చెప్పాల్సిన పేరు. చిన్న హీరో ఈవెంట్ అయినా పెద్ద హీరోదైనా చిరు స్పీచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తారు. మహేష్ సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్లో చిరు స్పీచ్ బాగా వైరల్ అయింది. ఇక నందమూరి నటసింహ బాలయ్య స్పీచ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వేరే హీరోల ఈవెంట్ అయినా బాలయ్య స్పీచ్ అనగానే ‘జై బాలయ్య’ స్లోగన్ వినిపించాల్సిందే అలాంటి క్రేజ్ బాలకృష్ణది. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ స్పీచ్. పీకే కనిపించాడంటేనే ఫ్యాన్స్ కి పునకాలు వస్తాయి. ఇక ఆ ఈవెంట్ ఏ హీరోది అనే విషయం అక్కర్లేదు పవన్ స్పీచ్ కోసం ఎదురుచూస్తారు ప్రేక్షకులు.
ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్, తారక్ మాట్లాడితే అలాగే వినాలనిపించేలా ఉంటాయి ఆ మాటలు. స్పీచ్ ఇవ్వాలంటే తారక్ కి ఎవరూరు పోటీ రారు. చాలా చక్కగా అందరినీ ఆకట్టుకునేలా తన స్పీచ్ ఉంటుంది. అలాంటి తారక్ సూపర్ స్టార్ భరత్ అనే నేను ఈవెంట్ లో మహేష్ ని డామినేట్ చేసాడు తన స్పీచ్ తో, ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్సలోను అన్ని భాషల్లోను మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా చాలా సందర్భాల్లో స్పీచ్ తో డామినేట్ చేసేసాడు. తక్కువ మాట్లాడినా అభిమానులకు పునకాలు తెప్పిస్తుంది మహేష్ స్పీచ్. అఖిల్ సినిమా ఈవెంట్లో మహేష్ స్పీచ్ హైలైట్. ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సిన హీరో అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ తో ఉన్న బన్నీ స్పీచ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాలో బన్నీ స్పీచ్ అందరిని డామినేట్ చేసేసింది. ఇక వీళ్ళే కాకుండా విజయ్ దేవరకొండ స్పీచ్ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…