Political News

Anitha Reddy : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం లోకి నన్ను లాగుతున్నారు.. మార్ఫింగ్ చేసి నా ఫోటో పెట్టి వేదిస్తున్నారు… వైసీపీ మహిళా నేత ఫిర్యాదు..!

Anitha Reddy : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూడ్ వీడియోతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. జాతీయ స్థాయిలో కూడా ఈ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మహిళతో ఒంటి మీద బట్టలు లేకుండా వీడియో కాల్ లో మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. ఎలా బయటికి వచ్చిందో కాని ఈ విడియో సోషల్ మీడియాలో బయటికి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విపక్షాలకు మంచి అస్త్రం దొరికింది. ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో తో అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలో మహిళతో రొమాంటిక్ మాటలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇక ఈ వ్యవహారం లోకి వైసీపీ మహిళా నేతాను లాగి వేదిస్తున్నారంటు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీడియోలో మార్ఫింగ్ చేసి నా ఫోటో…

అనిత రెడ్డి అనే వైసీపీ మహిళా నేత టీడీపీ, జనసేన నాయకులు నా ఫోటోని మార్ఫింగ్ చేసి గోరంట్ల మాధవ్ పక్కన నా ఫోటో పెట్టిన వీడియో ద్వారా నన్ను వేదిస్తున్నారంటు ఆరోపించింది. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో స్వచ్చందంగా పని చేస్తున్న తనని ఇలా మార్ఫింగ్ ఫోటో ద్వారా టీడీపీ, జనసేన వాళ్ళు వేదిస్తున్నారని, అసభ్య పదజాలతో మెసేజీలు పెడుతున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ పెంట్ల పరిధి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కంప్లెయింట్ ఇచ్చారు.

టీడీపీ పార్టీ ఆఫీస్ నుండే ఇలాంటి మార్ఫింగ్ ఫోటోల పని సాగుతోందని లోకేష్ ఆధ్వర్యంలో ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఇక నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణ రాజు కూడా రెండేళ్లుగా నన్ను, నా భర్తను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అనిత రెడ్డి ఆరోపించారు. కొంతమంది జనసేన నాయకులు కూడా ఇలానే వేదిస్తున్నారంటు ఆరోపించారు. కరీమ్‌, వేణు, చందు, నవీన్‌కుమార్‌, రమణ అనే ఐదుగురు తనను సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించినట్లు అనితా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు లో తెలిపారు. తనపై సోషల్ మీడియా ద్వారా ఇలా వేదిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అనితా రెడ్డి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago