Tollywood heroine Rekha Vedavyas about her health and marriage
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖ వేదవ్యాస్. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ, 2001లో ‘ఆనందం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘దొంగోడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకప్పుడు యూత్‌కి కలల రాణిగా మారిన రేఖ, తన అందం, అభినయంతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.
అయితే తెలుగులో అవకాశాలు తక్కువ రావడంతో ఆమె ఎక్కువగా కన్నడ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కెరీర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమా ప్రపంచానికి గుడ్ బై చెప్పింది. 2014 తర్వాత ఆమె వెండితెరపై కనిపించకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అనంతరం ఓ రియాలిటీ షోలో పాల్గొన్న రేఖ, బక్కచిక్కిన శరీరంతో, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపంతో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది.
బెంగళూరులో పుట్టిన, పెరిగిన రేఖ, కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించిందట. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తూ, మళ్లీ నటన రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ, “వ్యక్తిగత కారణాల వల్ల 2014 నుంచి 2020 వరకూ సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. కోవిడ్ రాకముందే మళ్లీ నటించాలనే ఆలోచన వచ్చింది. టెలివిజన్ షోలో కూడా పాల్గొన్నాను. కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో తీవ్రంగా బాధపడ్డాను. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. నిజంగా నరకాన్ని అనుభవించాను. మళ్లీ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆ ఆరోగ్య సమస్య వల్ల ఎంతో బాధపడ్డాను. అంతటి ప్రభావం చూపించగలదని అప్పుడు తెలిసింది” అని వెల్లడించింది.
“ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్య విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అని తెలిపింది.
మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ నటికి అభిమానులు ఇప్పటికే ఎగిరి గంతేస్తున్నారు. రేఖ వేదవ్యాస్ రీ ఎంట్రీతో మరోసారి టాలీవుడ్‌కి ఓ టాలెంటెడ్ బ్యూటీ తిరిగి వస్తుందన్న ఆశ జనం మనసుల్లో చిగురిస్తోంది.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…