టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో హీరోయిన్లు పరిచయమైనా కొందరు మాత్రమే తమ అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలా తక్కువ సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించిన కథానాయికల్లో రీమాసేన్ ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో కొన్నేళ్ల పాటు రీమాసేన్ అగ్ర కథానాయికగా కొనసాగారు. స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా నటించిన ప్రతి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి కథానాయికగా అంచెలంచెలుగా ఎదిగారు.
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా రీమాసేన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. సాధారణంగా నెగిటివ్ టచ్ తో కూడిన పాత్రల్లతో నటించడానికి హీరోయిన్లు ఇష్టపడరు. అయితే రీమాసేన్ మాత్రం యుగానికి ఒక్కడు, వల్లభ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి తన ప్రతిభను నిరూపించింది.
వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే రీమాసేన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. పద్ధతిగా కనిపించే పాత్రల్లోను, గ్లామరస్ పాత్రల్లోనూ నటించి రీమాసేన్ అభిమానులను మెప్పించడం గమనార్హం. అయితే ఈమె వ్యక్తిగత వివరాలు మాత్రం చాలామందికి తెలియవు. రీమా సేన్ శివ కరణ్ సింగ్ అనే ప్రముఖ బిజినెస్ మేన్ ను 2012లో వివాహం చేసుకుంది. ఈయన ప్రముఖ రెస్టారెంట్ గ్రూప్స్ కు ఓనర్ కావడం గమనార్హం. ఈ దంపతులకు ఒకే ఒక్క కొడుకు.
రీమాసేన్ దంపతుల కొడుకు పేరు రుద్రవీర్ సింగ్. ప్రస్తుతం రుద్ర వీర్ వయస్సు ఎనిమిది సంవత్సరాలు. పెళ్లికి ముందు వరకు సినిమాల్లో నటించిన రీమాసేన్ పెళ్లి తరువాత మాత్రం సినిమాల్లో ఎందుకో నటించలేదు. రీమాసేన్ తెలుగు, తమిళంతో పాటు కన్నడ, బెంగాళీ, హిందీ సినిమాల్లో నటించింది. రీమాసేన్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…