టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో బ్రహ్మానందం కూడా ఒకరు. దశాబ్దాల కాలం నుంచి వరుస అవకాశాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఒక దశలో కమెడియన్లలో బ్రహ్మానందం ఎక్కువ పారితోషికాన్ని అందుకున్నారు. తన కామెడీతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం వివాదాలకు దూరంగా ఉంటారు. దాదాపు 1000 సినిమాల్లో బ్రహ్మానందం వివిధ పాత్రల్లో నటించాడంటే ఆయన టాలెంట్ ఏంటో సులభంగానే అర్థమవుతుంది.
వందల సంఖ్యలో సినిమాల్లో నటించడంతో బ్రహ్మానందం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు. పలు స్టార్ హీరోల సినిమాలు బ్రహ్మానందం కామెడీ వల్లే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయంటే ఆయన కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో సులువుగా అర్థమవుతుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే ప్రతిభ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం. తరాలు మారినా భవిష్యత్తులో సైతం బ్రహ్మానందం కామెడీ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.
అయితే బ్రహ్మానందం డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడతారనే పేరుంది. వృథా ఖర్చులను ఆయన అస్సలు ప్రోత్సహించారు. సినిమా ఇండస్ట్రీలో నటులు కొంత అజాగ్రత్త వహించినా ఓడలు బండ్లు బండ్లు ఓడలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చు విషయంలో బ్రహ్మానందం ఆచితూచి అడుగులేస్తారనే పేరుంది. తెలుస్తున్న సమాచారం మేరకు బ్రహ్మానందం 300 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవనంలో నివశిస్తున్నారు. ఆయనకు సొంత కార్లు కూడా ఉనాయి. గత కొన్నేళ్ల నుంచి తక్కువగా సినిమాల్లో నటిస్తున్న బ్రహ్మానందంకు కొన్ని నెలల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది. అయితే షూటింగులు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత పలు సినిమాల్లో నటించడానికి బ్రహ్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…