Featured

Tollywood : 1992లో వచ్చిన ఈ పెద్ద హీరోల చిత్రాల్లో ఏది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందో తెలుసా.?!

1990 ప్రారంభ దశకంలో నూతన హీరోయిన్లతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడింది. బొబ్బిలిరాజా చిత్రంతో “దివ్యభారతి” పెద్దింటి అల్లుడు చిత్రంతో “నగ్మా” ఇంద్రభవనం చిత్రంతో “మీనా” ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో “రంభ” జంబలకిడి పంబతో “ఆమని” సర్పయాగంతో “రోజా” మనవరాలి పెళ్లితో “సౌందర్య” వెండితెరకు పరిచయమయ్యారు.

ఇక 1992 విషయానికి వచ్చినట్లయితే అనేక తెలుగు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను రంజింపజేసాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన “గ్యాంగ్ లీడర్” చిత్రం 1991లో ఇండస్ట్రీ హిట్ గా నిలువగా.. 1992లో చిరంజీవి తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ.. “ఘరానా మొగుడు” చిత్రంతో దూసుకువచ్చారు. దేవి వరప్రసాద్ నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానామొగుడు చిత్రం విడుదల అయ్యింది.

ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా, వాణివిశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కన్నడంలో విజయం సాధించిన చిత్రాన్ని తీసుకుని తెలుగులో “ఘరానామొగుడు” చిత్రాన్ని రూపొందించడం జరిగింది. చిరంజీవి తనదైన బాడీ లాంగ్వేజ్, అండ్ మేనరిజం డైలాగ్స్, అదిరిపోయే డాన్స్, అదరగొట్టే ఫైట్స్ తో సినిమాని విజయం వైపు నడిపించి ఆ సంవత్సరం ఘరానా మొగుడు చిత్రాన్ని ఇండస్ట్రీహిట్ గా నిలిపాడు.

ఇకపోతే సురేష్ ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో “బొబ్బిలిరాజా” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అంతే దూకుడుతో వెంకటేష్ ముందుకు దూసుకు వచ్చారు. ఈ సారి యాక్షన్ సినిమా కాకుండా పూర్తి విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. క్రియేటివ్ కమర్షియల్, కె.ఎస్.రామారావు నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “చంటి” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఊరు జమిందారు పాత్రలో నాజర్ ప్రధాన పాత్రను పోషించారు. ఇళయరాజా అందించిన ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అనే పాట ప్రేక్షకులను ఉత్సాహంతో ఉరకలెత్తించగా.. పావురానికి పంజరానికి.. అనే పాట ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇళయరాజా అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చంటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక పోతే ఇదే సంవత్సరంలో పోలీస్ పాత్రలో బాలకృష్ణ దూసుకు వచ్చారు. టి.త్రివిక్రమరావు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “రౌడీఇన్స్పెక్టర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. లోగడ బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీడ్రైవర్ చిత్రం విజయవంతం కాగా మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం రూపుదిద్దుకుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ ఇరగదీశారు. పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు బాలయ్యబాబు పలికిన తీరు ఆయన అభిమానులను హోరెత్తించాయి. బప్పీలహరి అందించిన పాటలు రౌడీఇన్స్పెక్టర్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

1992వ సంవత్సరం చిరంజీవి, బాలకృష్ణ వెంకటేష్ చిత్రాలు విజయవంతంగా ప్రదర్శింపబడగా…ఘరానా మొగుడు 55 కేంద్రాల్లో 50 రోజులు 39 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి పది కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.చంటి చిత్రం 33 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి 9 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.రౌడీ ఇన్స్పెక్టర్ 35 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి దాదాపు ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

20 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

21 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

21 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

21 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

23 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

24 hours ago