Rajamouli Thanks: ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… రాజమౌళి ట్వీట్ వైరల్!
Rajamouli Thanks: గత నాలుగు సంవత్సరాల నుంచి రాజమౌళి ఎంతో ప్రాణం పెట్టి తెరకెక్కించిన RRR ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదలై అద్భుతమైన విజయాలను తన సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను దక్కించుకుంది. ఇలా సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఈ సినిమాపై స్పందిస్తూ అద్భుతమైన రివ్యూ ఇస్తున్నారు.
ఇప్పటికే స్టార్ సెలబ్రెటీలు చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, మంచు బ్రదర్స్,సుకుమార్, శంకర్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. ఇక ఈ సినిమా ద్వారా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగి పోతున్నాయి.
ఈ విధంగా ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేయడంతో వీరందరి ట్వీట్ల పై రాజమౌళి స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. మీ అందరి ప్రశంసలతో ఆనందంతో పొంగిపోతుంది అంటూ రాజమౌళి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక మూడు సంవత్సరాలనుంచి జక్కన్న తన కుటుంబ సభ్యులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసారు.ఈ విధంగా ఈ సినిమాతో మూడు సంవత్సరాల నుంచి బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో త్వరలోనే యూరప్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఏప్రిల్ మొదటి వారంలో రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక 15 రోజుల పాటు యూరప్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…