Tollywood piracy mastermind arrested!
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ కలకలం రేపుతున్న పైరసీ మాఫియాలో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు ఏసీ టెక్నీషియన్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్.. ఇప్పుడు టాలీవుడ్‌ను వణికించిన డిజిటల్ క్రిమినల్‌గా మారిపోయాడు. సైబర్ క్రైం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి సినీ ఇండస్ట్రీకు ఊపిరి పీల్చే అవకాశం కల్పించారు.
ఫోన్‌తోనే పైరసీ.. డాలర్ల లో లాభం!
ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సినిమాలపై ఆసక్తి పెరిగిన కిరణ్‌కుమార్, హాళ్లలో విడుదలైన సినిమాలను మొబైల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసే స్కామ్‌లోకి దిగాడు. సినిమా విడుదలైన మరుసటి రోజే పిరేటెడ్ వెర్షన్‌ను లీక్ చేస్తూ, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేస్తూ వచ్చాడు. అతడు డబ్బులను నేరుగా కాకుండా, ట్రేస్ చేయలేని క్రిప్టోకరెన్సీ రూపంలో కమిషన్లు తీసుకుంటూ నెలకు రూ. 80 వేల వరకు సంపాదిస్తున్నాడు.
65కి పైగా సినిమాలకు పైరసీ
కిరణ్‌కుమార్ ఇప్పటివరకు 65కి పైగా తెలుగు సినిమాలకు పైరసీ చేశాడని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా బడా హీరోల సినిమాలు విడుదలైన వెంటనే టెలిగ్రామ్‌లో లీక్ అవుతున్న కారణంగా, నిర్మాతలు తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. విచారణలో బయటపడ్డ వివరాలు సినీ వర్గాల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.
2019 నుంచి పైరసీ మాఫియా
2019 నుంచే ఈ పైరసీ గుట్టు విప్పకుండా సినిమాలను చోరీ చేస్తూ వచ్చిన కిరణ్.. చివరకు పోలీసుల చిక్కుపడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పైరసీ వెనక ఉన్న మరిన్ని నెట్‌వర్క్‌లపై కూడా దర్యాప్తు చేపట్టారు. అతడి టెలిగ్రామ్ ఛానెల్స్, డివైజ్‌లు, క్రిప్టో ట్రాన్సాక్షన్లు అన్ని నిఘా కింద ఉన్నాయి.
రూ.3,500 కోట్ల నష్టం.. టాలీవుడ్ ఆగ్రహం
తెలుగు ఫిలిం ఛాంబర్ అంచనా ప్రకారం, గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ. 3,500 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. సినిమాలను మద్యం కంటే తక్కువ ధరకే టెలిగ్రామ్‌లో చూసే పరిస్థితి ప్రేక్షకుల మానసికతను చెడగొడుతోందని, చిత్ర పరిశ్రమ పునాదులు దెబ్బతింటున్నాయని పలువురు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలకు డిమాండ్
“వందల మంది కష్టంతో నిర్మించే సినిమాలను ఇలాంటివారు చౌకగా చిందించటం దారుణం. ఈ లెక్కలకు మించిన నష్టం చిత్రసీమకు వాటిల్లుతోంది. ఇప్పటికైనా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది.
ఈ కేసు అనంతరం టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా మరింత నిఘా అవసరమని, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…