ప్రభాస్ కు భయపడిపోతున్న నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రెమ్యూనరేషన్ 10 రెట్లు పెరిగింది. అతడు ప్రస్తుతం మన భారతదేశానికే కాదు.. ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఒక్క సినిమాకు రూ.60 నుంచి రూ.70 కోట్లకుపైగా అడుగుతున్నట్లు సమాచారం. ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ తో టాలీవుడ్ నిర్మాతలు సినిమా తీయలంటే ఎక్కువగా భారం పడుతోంది.

బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లతో పాటు మరికొన్ని భాషల్లో కూడా కథలు వింటున్నాడట ప్రభాస్. కథలు నచ్చుతున్నా.. అతడు చెప్పే రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గిపోతున్నట్లు సమాచారం వినపడుతోంది. ఒకప్పుడు ప్రభాస్ తో సినిమాలు తీయాలని దర్శక , నిర్మాతలు ఎంతో భావించారు. అయితే ప్రస్తుతం హీరో ప్రభాస్ తో సినిమాలు తీయాలంటే భయంతో వెనకడుగు వేసే పరిస్థతి వచ్చింది.

అతడు ఏ సినిమా తీసిన ఇక పాన్ ఇండియా లెవల్లోనే తీయాలి. అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటూ.. అంత భారీ బడ్జెట్ తో సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు.. బడా నిర్మాతలు అయితేనే తట్టుకోగలరు.. చిన్న చిన్న నిర్మాతల వల్ల మాత్రం ఆ పని జరిగేది కాదు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రభాస్ వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో పాటు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలను స్టార్ట్ చేసారు. దాంతో పాటు మరో ఇద్దరు దర్శకులను లైన్‌లో పెట్టారు. త్వరలో తన 25వ సినిమాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రభాస్ రెమ్యూనరేషన్ కు భయపడి వెనుకడగు వేస్తుంటే.. కొంత మంది మాత్రం ప్రభాస్ వెంట క్యూ కడుతున్నారు.