2020 వ సంవత్సరం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ కరోనాతో కరిగిపోయింది. ఈ ఏడాది అతి ముఖ్యం అనుకున్న సమ్మర్ సీజన్ కూడా గాయబ్ అయిపోయేలా ఉంది. 2021 సంక్రాంతి అనుమానంగా మొదలై సినిమాలకు పర్వాలేదు అనిపించుకుంది.దాంతో సినిమా ఇండస్ట్రీలు అన్ని 2021 సమ్మర్ ను గొప్పగా ప్లాన్ చేసుకున్నాయి. ప్రతి వారం ఓ భారీ సినిమాని ప్లాన్ చేశారు. రెండు నెలల క్రితం పరిస్థితి బాగానే ఉంది. థియేటర్లు కూడా సమ్మర్ కి పూర్తిగా సెట్ అవుతాయి అనే నమ్మకం కలిగింది.
అందుకే, నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కు రెడీ అవ్వాలనే ఉద్దేశ్యంతో చాల స్పీడ్ గా షూటింగ్ లు జరువుకున్నాయి. నిజానికి భారీ సినిమా పూర్తి కావాలంటే ఆరేడు నెలలు కనీసం పడుతుంది.అయితే ప్రతి భారీ సినిమాకి రిలీజే ముఖ్యం కాబట్టి.. సమ్మర్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి, హీరోలు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ కోసం తెగ కష్టపడ్డారు.
కొరటాల శివ-మెగాస్టార్ ఆచార్య సంగతే తీసుకుందాం. ఒక్క రోజు కూడా చిరు షూట్ కి గ్యాప్ ఇవ్వకుండా మెగాస్టార్ ఈ సినిమా కోసం పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని సమ్మర్ కి గట్టిగా ప్లాన్ చేశారు. సినిమా కూడా చివరి దశలో ఉంది.కానీ ఏం లాభం ? కరోనా సెకెండ్ వేవ్ తో మెగా కష్టం అంతా వృధా అయిపోయింది. అలాగే బోయపాటి-బాలయ్య సినిమాను కూడా భారీ సమ్మర్ సినిమాగా తీసుకోవడానికి బాలయ్య బృందం తెగ ఆరాట పడింది.
అదే విధంగా మహేష్ సర్కారువారి పాట కూడా, ఇలాగే ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, కెజిఎఫ్ 2, తలైవి, ఇలా భారీ సినిమాల అన్ని సమ్మర్ రిలీజ్ కోసం తెగ కష్టపడ్డాయి. కానీ ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాలు విడుదల చేయడానికి ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రావడం లేదు.. దీంతో సమ్మర్ సీజన్ కూడా వృధా అయినట్టే అంటున్నారు విశ్లేషకులు..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…