తెరపైన వారి నటనతో, డైలాగులు, డాన్స్ లు చేసి మనల్ని ఆకట్టుకుంటారు మన సినిమా హీరో హీరోయిన్స్… ఇదంతా కేవలం సినితెర మీద మాత్రమే. అవి మనకు నచ్చితే వారిని పిచ్చిగా అభిమనిస్తాం. ఇక నిజ జీవితంలో వచ్చేసరికి వారు చేసే కొన్ని పనుల వల్ల జనాల్లో వారిపై కొంత అవిశ్వాసం ఏర్పడుతుంది. వారి గురించి ఒక్కో మీడియా ఒక్కోలా ఆ హీరోయిన్ కి ఈ హీరోతో ఎఫైర్ ఉంది, ఈ హీరోకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ చాలా పనికిమాలిన వార్తలు వస్తుంటాయి. ఇకపోతే, అందులో వాస్తవం కొంతవరకే అయినా, కొందరు సినీ సెలబ్రిటీలు ఒకసారి పెళ్లయ్యాక మళ్ళీ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు..
అప్పటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరనుంచి నిన్న పెళ్లి చేసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు వరకు చాలా మందే ఉన్నారు. అయితే ఒకసారి మన టాలీవుడ్ లో వారెవరో చూద్దామా.. !
మొదటగా టాలీవుడ్ లో చెప్పుకోతగ్గది సీనియర్ ఎన్టీఆర్. మన తెలుగు సినిమా తొలి తరంలో సూపర్ స్టార్ అంటే నందమూరి తారక రామారావు. ఇక 1942 సంవత్సరంలో తన మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆమె క్యాన్సర్ తో మరణించడంతో ఒంటరైన రామారావు చివరి దశలో 1993 సంవత్సరంలో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు ఆయన.
ఇక అలాగే మరో సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1961 సంవత్సరంలో ఇందిరాదేవిని వివాహంచేసుకున్న కృష్ణ, 1969 సంవత్సరంలో తన సహనటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇక అలాగే సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా రెండు పెళ్లిళ్ల విషయంలో తండ్రి ఎన్టీఆర్ నే అనుసరించాడు. 1973 సంవత్సరంలో లక్ష్మీని పెళ్లి చేసుకున్న, అనంతర కొన్ని పరిణామాలతో హరికృష్ణ షాలినిని వివాహం చేసుకున్నారు.
ఇక వీరివరుసలోని మరికొందరు కూడా రెండు పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, కృష్ణం రాజు, మంచు లక్ష్మి, కీర్తి రెడ్డి, శరత్ బాబు, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, తాజాగా దిల్ రాజు వీరందరూ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నవారే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…