ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతున్నాయో అంత త్వరగా విడిపోతున్నారు కూడా ఆ జంటలు. వారిద్దరూ ఎప్పుడు ఎలా కలుసుకుంటారో తెలియదు కానీ, అనుకోకుండా ప్రేమలో పడతారు. అలాగే తొందరపడి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత సరిపోక విడిపోతారు. ఇది కేవలం మామూలు సాధారణ ప్రజలు కాకుండా సెలబ్రిటీల వరకూ ఇదే తంతు కొనసాగుతోంది.
అయితే ఇలా విడిపోయాక ప్రేమ పెళ్లి విషయాలలో ఓడిపోయామని ఎవరు ఒకచోట కూర్చొని బాధపడకుండా మరొకరితో మరో సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కల్చర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉంది. పెళ్లి అయిన వారు కూడా సినీ సెట్స్ లో ఉండే హీరో, హీరోయిన్ల ప్రేమలో పడి పోతున్నారు. అలా ఆ ప్రేమను కొన్నాళ్ళు సాగించి ఇద్దరికీ ఓకే అనుకుంటే తిరిగి మళ్లీ వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు.
అయితే ఇక ఈ విషయంలో ముందుగా చెప్పుకొనేది హీరోయిన్ రాధిక గురించి. ఈవిడ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండు సార్లు పెళ్లి విషయంలో విఫలమైన ఒక బిడ్డతో కలిసి జీవిస్తున్న రాధికను అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న శరత్ కుమార్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు జీవనం బాగానే సాగిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించాడు.
ఇక ఇదే కోవలోకి మరో నటి సీత కూడా వస్తుంది. ఈవిడ అ తల్లి పాత్రలకు ఒక హుందాతనాన్ని తీసుకొని వచ్చింది అంటే నమ్మండి. ఈవిడ కూడా మొదట్లో ఒక ఒక తమిళ స్టార్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత వారిద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోవడం జరిగింది. ఇక ఆ సమయంలోనే ఖాళీగా ఉండకుండా సీరియల్స్ లోకి తన ఎంట్రీ ఇచ్చింది సీత. ఇక అదే సమయంలో బుల్లితెర హీరో గా సాగుతున్న సతీష్ ను ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు ఆయనతో కూడా విడిపోయి మళ్లీ ఒంటరిగానే జీవిస్తుంది నటి సీత.
ఇక ఈ లిస్టులో తమిళ సీనియర్ హీరో కమలహాసన్ కూడా అయాన్ గౌతమిని ప్రేమించడానికి ముందే ఆయనకు వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే వాణి గణపతిని వివాహం చేసుకున్నప్పటికీ సారికను ప్రేమించి వివాహం చేసుకున్నారు కమల్ హాసన్. ఇక ఆ తర్వాత ఆమెపై మనసు పారేసుకుని సారిక కూడా విడాకులు ఇచ్చాడు ఈ తమిళ హీరో. అయితే అప్పటికే పెళ్లయి ఒక కూతురికి తల్లి అయిన గౌతమి, కమలహాసన్ ప్రేమకు దాసోహం అయింది. అయితే వీరి బంధం 10 సంవత్సరాలు కొనసాగిన తరువాత కమల్ హాసన్ కు గుడ్ బాయ్ చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
ఈ మధ్య రామ్ చరణ్ సినిమా వినయ విధేయ రామలో కనిపించిన జీన్స్ హీరో ప్రశాంత్ నిజజీవితంలో ఆయన దారుణంగా మోసపోయాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో గృహలక్ష్మి అనే అమ్మాయిని తాను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆవిడకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందట. ఇక ఆ విషయం బయటపడడంతో హీరో ప్రశాంత్ భార్య కుటుంబం పై కోర్టుకు వెళ్లి అదొక క్రైమ్ స్టోరీ గా తలపించే విధంగా తయారైందట.
ఇక మరొక వింతైన ప్రేమ కథ కావ్య మాధవన్, దిలీప్ లది. వీరిద్దరూ కలిసి 20 సినిమాలకు పైగా చేశారు. ఇకపోతే హీరో దిలీప్ కు మంజు వారియర్ తో ప్రేమ వివాహం జరిగి వారికి ఒక పాప కూడా ఉంది. ఇకపోతే కావ్య మాధవన్, దిలీప్ ల మధ్య సినిమా షూటింగ్ లొకేషన్స్ లో కుదిరిన ప్రేమ వలన కావ్య మాధవన్ వారి సంగతి తన ఇంట్లో చెప్పింది. దీనికి ఒప్పుకొని వారి కుటుంబ సభ్యులు కావ్య మాధవన్ కు మరొక పెళ్లి చేశారు. అయితే ఆ తర్వాత కావ్య మాధవన్ అతడిని మూడు నెలలు తిరగకుండానే కోర్టుకు నడిపించి నానా రభస చేసింది. ఇక అలాగే హీరో దిలీప్ కూడా మంజు తో విడాకులు తీసుకొని కావ్య ను వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత హీరో దిలీప్ కొత్తగా వచ్చిన నటి భావనతో సంబంధం ఉందన్న ఉద్దేశంతో భావనను కావ్య మాధవన్ మనుషులతో అపహరించి మరి వార్నింగ్ ఇచ్చిన కేసు ఒకటి ఇంకా జరుగుతూనే ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…