Categories: FeaturedMovie News

దాసరి నారాయణ రావు తోడబుట్టిన సోదరులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా?

డా. దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించారు. దాసరి వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు. ఈయనకు చిన్నపటి నుండే నటనపై ఆసక్తితో నటనలో రాణిస్తూ సినిమా రంగం వైపు వచ్చారు. ఇక అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ రికార్డ్ లకు కూడా ఎక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో రచయితగా, పాటల రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

ఇక అసలు విషయానికి వస్తే… దాసరి గారు ఎంఎంకేఎన్ఎం స్కూల్ లో SSLC వరకు చదువుకున్నారు. అయితే ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో ఆయనే సొంతంగా కథలు రాసుకొని అందులో నటించి మెప్పించేవారట. అంతేకాదు SSLC లో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కూడా అయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఇక అయితే ఇకపోతే దాసరి సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, దాసరి సత్యనారాయణ రావు వారిద్దరూ పాలకొల్లు లో నివసిస్తున్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

దాసరి నారాయణరావు ఇద్దరు సోదరులు ఒకరైన దాసరి వెంకటేశ్వరరావు గారు మిలిటరీ కి సంబంధించిన వ్యక్తి. ఈయన వివిధ రాష్ట్రాల్లో వివిధ కంటోన్మెంట్ లో మిలిటరీ బాధ్యతలు వహించి చివరగా కాశ్మీర్ కంటోన్మెంట్లో పనిచేసి దాసరి నారాయణ కొరకు ఆయన ఉద్యోగాన్ని త్యాగం చేసి చెన్నైకి తిరిగి వచ్చాడు. ఇక ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారితో ఉంటూ ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్ ను చూస్తూ ఉండేవారు.

ఇక మరో సోదరుడు దాసరి సత్యనారాయణ రావు. ఈయన కూడా పాలకొల్లులో సాదాసీదా జీవితం కొనసాగిస్తున్నారు. వారి కుమారులు వేరే నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడటంతో వారు ఒక చిన్న ఇంట్లో ఉంటూ కాలక్షేపానికి జిరాక్స్ మిషన్ ను పెట్టుకొని చిన్నపాటి కాలక్షేపం తోపాటు సంపాదన ఆర్జిస్తున్నారు దాసరి సత్యనారాయణ రావు. అయితే దాసరి నారాయణరావు తాను పుట్టి పెరిగిన ఊరికోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఊరిలో మహిళల కోసం ఒక డిగ్రీ కాలేజీ ని కట్టించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago