డా. దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించారు. దాసరి వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు. ఈయనకు చిన్నపటి నుండే నటనపై ఆసక్తితో నటనలో రాణిస్తూ సినిమా రంగం వైపు వచ్చారు. ఇక అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ రికార్డ్ లకు కూడా ఎక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో రచయితగా, పాటల రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

ఇక అసలు విషయానికి వస్తే… దాసరి గారు ఎంఎంకేఎన్ఎం స్కూల్ లో SSLC వరకు చదువుకున్నారు. అయితే ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో ఆయనే సొంతంగా కథలు రాసుకొని అందులో నటించి మెప్పించేవారట. అంతేకాదు SSLC లో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కూడా అయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఇక అయితే ఇకపోతే దాసరి సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, దాసరి సత్యనారాయణ రావు వారిద్దరూ పాలకొల్లు లో నివసిస్తున్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

దాసరి నారాయణరావు ఇద్దరు సోదరులు ఒకరైన దాసరి వెంకటేశ్వరరావు గారు మిలిటరీ కి సంబంధించిన వ్యక్తి. ఈయన వివిధ రాష్ట్రాల్లో వివిధ కంటోన్మెంట్ లో మిలిటరీ బాధ్యతలు వహించి చివరగా కాశ్మీర్ కంటోన్మెంట్లో పనిచేసి దాసరి నారాయణ కొరకు ఆయన ఉద్యోగాన్ని త్యాగం చేసి చెన్నైకి తిరిగి వచ్చాడు. ఇక ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారితో ఉంటూ ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్ ను చూస్తూ ఉండేవారు.

ఇక మరో సోదరుడు దాసరి సత్యనారాయణ రావు. ఈయన కూడా పాలకొల్లులో సాదాసీదా జీవితం కొనసాగిస్తున్నారు. వారి కుమారులు వేరే నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడటంతో వారు ఒక చిన్న ఇంట్లో ఉంటూ కాలక్షేపానికి జిరాక్స్ మిషన్ ను పెట్టుకొని చిన్నపాటి కాలక్షేపం తోపాటు సంపాదన ఆర్జిస్తున్నారు దాసరి సత్యనారాయణ రావు. అయితే దాసరి నారాయణరావు తాను పుట్టి పెరిగిన ఊరికోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఊరిలో మహిళల కోసం ఒక డిగ్రీ కాలేజీ ని కట్టించారు.



























