కమర్షియల్ సినిమా అయినా.. సామాజిక సందేశం ఉన్నదైనా.. హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఆయా సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించినా.. హీరో డామినేషన్ వల్ల పెద్దగా పేరు రాదు.
అలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు అందం, అభినయంతో చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని ఏలుతూ టాప్ హీరోయిన్లుగా స్థిరపడ్డారు. ఇక వారిలో కొంతమంది హీరోయిన్ల పారితోషికాల వివరాలు మీకోసం..
నయనతార.. ఈ భామ దశాబ్దన్నర కాలంగా సౌత్‌లో ఎదురులేని లేడి సూపర్‌స్టార్‌గా వెలిగిపోతోంది. అగ్ర హీరోలందరికీ నయన్‌నే ఏకైక ఆప్షన్.. అందుకే ఆమె అడిగినంతా ఇచ్చి.. ఒక్కోసారి బ్రతిమాలుకుని మరీ పారితోషికాలు అందిస్తుంటారు మన నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, విజయ్, రజినీకాంత్ వంటి టాప్స్ స్టార్ల సరసన నటిస్తోంది నయన్. అటు ఆమె సోలోగా సినిమా చేసినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదిరిపోతుంటాయి. ఇకపోతే ‘సైరా’ సినిమాకు ఆమె 6 కోట్ల పారితోషికం అందుకుంటోందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమయంలో పారితోషికంగా కోటి రూపాయలు తీసుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ లో తన రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తోంది.
దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. ఒక్కో సినిమా రూ 3.5కోట్ల నుంచి 4 కోట్లు తీసుకుంటుందని వినికిడి. తన సక్సెస్ రేట్ కారణంగా ఇప్పుడు పారితోషికం మరింత పెంచే ఛాన్స్ ఉంది.
ముంబై భామ పూజా హెగ్డే హవా టాలీవుడ్‌లో విపరీతంగా ఉందని చెప్పొచ్చు. ఆమె ఒక్కో చిత్రానికి రూ.2 కోట్లు వెనకేసుకుంటోందని సమాచారం.
అందాల తార కియారా అద్వానీ కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అవుతూ రూ.3 కోట్ల రెమ్యునరేషన్‌ను ఖాతాలో వేసుకుంటోందట.
మొదట్లో అందరూ ఐరన్ లెగ్ అని పిలిచినా.. మెల్లగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఒక్కో సినిమాకు రూ.90 లక్షల నుండి కోటి రూపాయల వరకు తీసుకుంటుంది.
కుర్ర హీరోయిన్ల హవా పెరిగినా కాజల్ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. తన క్రేజ్ తగ్గుతున్నా.. అమ్మడు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర వరకు తీసుకుంటుంది.
‘మహానటి’ తెచ్చిన క్రేజ్ తో కీర్తి సురేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. నిర్మాతలు ఆమెకు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ప్లాప్స్ చవి చూడటంతో.. ఆమె పారితోషికం రేంజ్ కోటి నుంచి 50 లక్షలకు పడిపోయిందని చెప్పుకుంటున్నారు.
పెళ్లైనా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న సమంత ఒక్క సినిమాకు రూ.2 కోట్లు చార్జ్ చేస్తోంది. ’96’ రీమేక్ కోసం ఈమె రెండు కోట్లకు పైగానే తీసుకుంటుందని సమాచారం. మజిలీ, ఓ బేబి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన సమంత తన పారితోషికాన్ని పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తన తోటి హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో కోటి దాటేసినా.. రాశిఖన్నా మాత్రం ఇంకా రూ.60 లక్షలే చార్జ్ చేస్తోంది. ఓ పెద్ద హిట్టు కొడితేనే తప్ప అమ్మడు రెమ్యునరేషన్ పెరిగేలా లేదు.
తెలుగులో త్రిష హవా తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. కోలివుడ్ లో ఒక్కో సినిమాకు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ఒక సినిమాకు రూ.90 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…