ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా తమకిష్టమైన సెలబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు సోషల్ మీడియాలో చర్చించడం, హాష్ టాగ్ లతో పోస్టులు పెట్టడం ప్రస్తుతం కాలంలో ట్రెండ్ గా మారిపోయింది. తమకిష్టమైన సెలబ్రిటీస్ గురించి ట్రోల్ చేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అయితే ఈ సంవత్సరం ముగుస్తుండటంతో సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎక్కువగా చర్చలు జరిగాయి, ఏ సెలబ్రిటీస్ గురించి ఎక్కువ ట్వీట్స్ పెట్టారనే విషయాన్ని ట్విట్టర్ అధికారకంగా వెల్లడించింది.
ఈ 2020 సంవత్సరంలో దక్షిణ భారత సూపర్ సినీ సెలబ్రిటీస్ వీళ్లేనంటూ టాప్ 10 సెలబ్రిటీస్ జాబితాను ట్విట్టర్ ఇండియా షేర్ చేసింది. ఈ జాబితాలో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ను బీట్ చేస్తూ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నాడు.
ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలువగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక మూడవ స్థానాన్ని తమిళ స్టార్ విజయ్ ఉండగా, నాలుగవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, అలాగే హీరో సూర్య ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ హీరోలందరి గురించి ఈ సంవత్సరం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేసినట్టు ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
ఇకపోతే దక్షిణాది హీరోయిన్ల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోయిన్లలో మహానటి సావిత్రి టాప్ వన్ పొజిషన్ లో ఉన్నారు. రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్, మూడవ స్థానంలో సమంత, నాలుగు, ఐదు స్థానాలలో రష్మిక, పూజా హెగ్డే చోటు దక్కించుకున్నట్లు ట్విట్టర్ జాబితాలో వెల్లడించింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…