Featured

కరెంట్ బిల్లు భారీగా వస్తోందా.. తగ్గించుకోవడానికి పాటించాల్సిన టెక్నిక్స్ ఇవే..?

మనలో చాలామందికి ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంచనాలకు అందని స్థాయిలో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పలు సందర్భాల్లో భారీగా వచ్చిన కరెంట్ బిల్లులను చూసి తలలు పట్టుకుంటున్నారు. చాలామంది గత నెలలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చిందని ఈ నెలలో మాత్రం అంచనాలను మించి వచ్చిందని చెబుతూ ఉంటారు.

అయితే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తే గాబరా పడవద్దని.. కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా సులభంగా కరెంట్ బిల్లును తగ్గించుకోవడం సాధ్యమవుతుందని తెలుపుతున్నారు. కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే మొదట మనం ఇంట్లో ఎక్కువగా వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువులపై దృష్టి పెట్టాలని.. అలా చేయడం ద్వారా మనం అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించి ఆదా చేయవచ్చని చెబుతున్నారు.

ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ విద్యుత్ వినియోగానికి కారణమయ్యే ఫ్రిజ్‌, గీజర్‌, ఒవెన్, ఏసీలను వాడే తీరు గురించి దృష్టి సారించాలని అధికారులు తెలుపుతున్నారు. శ్లాబ్ మారడం వల్లే చాలా సందర్భాల్లో కరెంట్ బిల్ పెరుగుతుందని.. ఎలక్ట్రానిక్ వస్తువులను క్రమపద్ధతిలో వాడితే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. గీజర్ ను ఒకేసారి ఆన్ చేసుకుని వినియోగించుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని తెలుపుతున్నారు.

ఏసీని వాతావరణానికి అనుకూలంగా పెట్టుకోవాలని.. తక్కువ ఉష్ణోగ్రత లోపెడితే కరెంట్ బిల్లు పెరుగుతుందని తెలుపుతున్నారు. గోడకు, ఫ్రిజ్ ఉంచే ప్రదేశానికి మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని.. వాషింగ్ మెషీన్ లో లోడ్ కు మించి బట్టలు వేయవద్దని సూచిస్తున్నారు. చిన్నచిన్న వంటలకు ఓవెన్ ను వినియోగించకపోతేనే మంచిదని తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago