Childhood: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కుర్చీలో కూర్చొని ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ ను డైరెక్టర్ గా పేరు పొందాడు.
ఈయన సినిమా అంటే రికార్డుల మోత మోగాల్సిందే. ఈయనతో పనిచేయడం కోసం ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరూ ఎదురుచూస్తూ ఉంటారు. అంత క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా అవును మీరు ఊహించింది నిజమే. ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి.
రాజమౌళి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈయన అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గాను, RRR సినిమాతో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు.
100 కోట్ల రెమ్యూనరేషన్..
ఇక ఈయన సినిమా చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఆ సినిమా విడుదలయితే మాత్రం అప్పటివరకు నమోదైన రికార్డులు అన్నింటిని చెరిపేస్తుంది. ఇలా ఈయన పనితనం చూసి హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈయనతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా రాజమౌళి ఒక్కో సినిమాకు హీరోలను మించి వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…