టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై గాసిప్స్ చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. సాధారణంగా సినిమా హీరోయిన్స్ పై వినిపించే లవ్ అఫైర్స్ రూమర్స్ కూడా కాజల్ పై చాలా తక్కువనే చెప్పాలి. అయితే టాలీవుడ్ చందమామ కాజల్‌పై తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్య కాజల్ కెరీర్ కాస్త స్లో అయినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె తన రెమ్యునరేషన్ కూడా బాగా తగ్గించేసిందంటూ నెట్టింట్లో రూమర్స్ వైరలవుతున్నాయి. కానీ వాస్తవానికి కాజల్ అలా చేసే ఛాన్సే లేదని చెప్పాలి. ఎందుకంటే, కాజల్ పైకి కనిపిస్తున్నట్లు ఖాళీగా ఏమీ లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా తెలుగులో కొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ఆల్రెడీ 2 భారీ సినిమా ఛాన్స్ లు కాజల్ చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ లో జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈమధ్య ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. కాబట్టి కాజల్ ఖాళీగా ఉందన్న మాట అబద్ధమేనని తేలి పోయింది. మరలాంటప్పుడు కాజల్ తన రెమ్యునరేషన్ ను ఎందుకు తగ్గించుకుంటుంది.? లేటెస్టుగా అందిన సమాచారం మేరకూ కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లు దాటినప్పటికీ ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఉదాహరణగా ఇప్పటికీ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగానే ఉంది. అటు యువ హీరోలతోనూ, ఇటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. ఇక అసలు విషయానికి వస్తే..
కాజల్ రెమ్యునరేషన్ తగ్గించుకుందనే రూమర్స్ కు చెక్ పెడుతూ ప్రస్తుతం టాలీవుడ్ భల్లాల దేవ హీరో రానా నటిస్తున్న హిందీ సినిమా హాథీ మేరే సాథీ చిత్రంలో కాజల్ ఓ ఓ గిరిజన యువతి పాత్రలో నటించిందట. ఆ చిత్రంలో కాజల్ పాత్ర అరగంట మాత్రమే ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం కాజల్ తగ్గలేదట. ఆ పాత్రలో నటించినందుకు గానూ కాజల్ అక్షరాల రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో అరణ్య పేరుతో విడుదల కాబోతుంది. అదండి సంగతి..! సో.. సోషల్ మీడియాలో మీరు చదివే రూమర్స్ అన్నీ నిజమేనని నమ్మేయకండి. దీపమున్నప్పుడే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో కాజల్ ను చూసి తెలుసుకోండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…