టాలీవుడ్ యంగ్ హీరోలైన నితిన్, నిఖిల్ లు ఈమధ్యనే పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మన భల్లాల దేవుడు రానా ఇంట్లో కూడా పెళ్ళి సందడి మొదలైంది. రానా పెళ్ళి మ్యాటర్ కన్నా ముందు మరింత షాక్ ఇచ్చే అంశమేమిటంటే.. రానాను ప్రేమించిన అమ్మాయి పేరు మిహీకా బజాజ్. ఈమె ఓ వెడ్డింగ్ ప్లానర్. మిహీకా ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తుండగా.. డ్యూ డ్రాప్ డిజైన్ పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ & డెకార్ కంపెనీని కూడా నిర్వహిస్తుండేది.
విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి ఈమధ్యనే జరిగిన సంగతి తెలిసిందే. మిహీక బజాజ్ తల్లి బంటీ బజాజ్ కూడా ఓ ఫేమస్ వెడ్డింగ్ జ్యువెలరీ డిజైనర్. వెంకీ పెద్ద కూతురు ఆశ్రితకు ఈమె మంచి ఫ్రెండ్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఆశ్రిత పెళ్ళికి ముందు నుండీ దగ్గుబాటి ఫ్యామిలీకి మిహీకా బాగా క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. అంతేకాకుండా రానా గతంలో ‘అమర్ చిత్ర కథ’ పేరుతో రామా నాయుడు స్టూడియోస్ లో ఓ క్రొత్త బిజినెస్ ని కూడా ప్లాన్ చేసాడు.
ఆ బిజినెస్ వ్యవహారాలను కూడా మిహీకా బజాజ్ చూసుకునేదట. ఆ నేపథ్యంలోనే రానా, మిహీకాలకు మధ్య పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకునేంత వరకూ వెళ్ళి ఇప్పుడు పెళ్ళి పీటలు కూడ ఎక్కుతున్నారన్నమాట. మొత్తానికి రానా ప్రేమ సక్సెస్ కి కారణం విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత అన్న విషయాన్ని లేటెస్ట్ గా రానా తన మ్యారేజ్ మెహంది వేడుకలలో బయటపెట్టడంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…