టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరైన రానా దగ్గుబాటి పెళ్లి వార్త కేవలం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాదు యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో సంచలనం రేకెత్తించింది. సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మిహికా తో పెళ్ళి చేసుకోబోతున్నట్టు రానా ప్రకటన చేయగానే చాలా మంది షాక్ కి గురయ్యారు.. ఆతరువాత తేరుకొని అందరూ శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు.
అయితే రానాకు త్రిషకు మధ్య ఎదో ఉందని, వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకొంటారనే టాక్ అప్పట్లో చాలానే వచ్చాయి. ఈ నేపధ్యంలో రానా పెళ్లి ప్రకటన తర్వాత త్రిష రియాక్షన్ ఏమిటి ఆని అందరిలో ఆసక్తి నెలకొంది.. అయితే రానా, త్రిషల మధ్య బంధం సినిమాలకు సంబంధించినది కాదు. వారిద్దరు చిన్నప్పటి నుంచే స్నేహితులు. వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే సుచీలీక్స్ సందర్భంగా రానా, త్రిషా క్లోజ్ గా ఉన్నప్పటి ఫోటోలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి కూడా.
ఈ నేపధ్యంలో రానా కూడా త్రిషతో డేటింగ్ చేస్తున్నట్టు పలు సందర్భాల్లో అంగీకరించారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రానా ఆ షోలో కారణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకు త్రిషాతో రిలేషన్ నిజమే. మా ఇద్దరిమధ్య కొంతకాలం డేటింగ్ నడించిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత బంధానికి పుల్ స్టాప్ పెట్టి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని చెప్పాడు రానా. అయితే కారణాలేమైన ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉంటున్నారు త్రిష. ఇప్పుడు మాత్రం రానా పెళ్లి విషయం తెలియగానే మళ్ళి త్రిష పేరు మీడియాలో మారుమ్రోగిపోతుంది.
ఇక తాజాగా లక్ష్మీ మంచు నిర్వహించిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, గర్ల్‌ఫ్రెండ్స్ గురించి చెప్పారు రానా. తన పెళ్లి వార్తపై నా గర్ల్ ఫ్రెండ్స్ సానుకూలంగా స్పందించారని, మిహికాతో పెళ్లి అనగానే వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు అని రానా చెప్పారు. ఇక తన పెళ్లి వార్తను ఇంస్తాగ్రాంలో రానా వెల్లడించగానే.. కొందరు సినీ ప్రముఖులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎట్టకేలకూ రానా ఓ ఇంటి వాడు కాబోతున్నందుకు హ్యాపీగా ఫీలయ్యారు. ఈ నేపధ్యంలో త్రిషా కూడా రానాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారట. ఇక మిహికాతో నీ దాంపత్య జీవితం చక్కగా ఉండాలని ఆమె దీవెనలు కూడా అందించినట్టు తెలిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…