టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా ఎన్నికల నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు చేసిన హంగామా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా ఇండియా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఇందుకు కారణం నాగబాబు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ వదులుతున్నారు. అసలు మ్యాచ్ ఓడిపోవడానికి నాగబాబుకు కారణం ఏమిటనే విషయానికి వస్తే…
దుబాయ్ లో జరిగిన మ్యాచ్ చూడటం కోసం మెగాబ్రదర్ నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ తో కలిసి వెళ్లారు. అయితే స్టేడియంకు వెళ్లి స్వయంగా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే చివరికి ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో అందుకు కారణం నాగబాబు అని కామెంట్ చేస్తున్నారు.
నాగబాబు ఐరన్ లెగ్ అని అతని ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్ళు ఓటమి పాలు అవుతారని ఆయన పై పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో తన అన్నచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించగా ఆ పార్టీలోకి నాగబాబు వెళ్లడంతో ఏకంగా పార్టీ భూస్థాపితం అయింది. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించగా నాగబాబు మద్దతు తెలపడంతో పవన్ కళ్యాణ్ ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా పది రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలపగా.. ప్రకాష్ రాజు కూడా ఘోరంగా ఓటమి పాలయ్యాడు. ఇలా నాగబాబు మద్దతు తెలిపిన వారందరూ ఓటమి పాలవడంతో అతను ఒక ఐరన్ లెగ్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు దుబాయ్ వెళ్లి ఇండియా మ్యాచ్ చూడటంతో మ్యాచ్ ఓడిపోవడానికి కూడా ఈయనే కారణమంటూ నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…