సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కి నటీనటుల వారసులు పిల్లలు రావడం సర్వసాధారణం .ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఎంతోమంది వారసుల సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే నందమూరి వారసుడి కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ కాంపౌండ్ నుంచి ఒక హీరో కూడా ఇండస్ట్రీకి పరిచయం కాలేదు.
దీంతో నందమూరి అభిమానులు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ ఆరా తీస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అతను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలకృష్ణ నేటి తరం హీరోలకు దీటుగా సినిమాలను చేస్తూ వెళ్తున్నారు.
ఇండస్ట్రీలో బాలకృష్ణ ఎంతో హ్యాపీగా సినిమాలు చేస్తున్నప్పటికీ అతనికి మాత్రం తన కొడుకు విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ ఉందని అతను తన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెడతాడనే విషయం గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇప్పటికే ఫిలిం స్కూల్లో శిక్షణ తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ అతను మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.
అయితే మోక్షజ్ఞకు సినిమాలలో నటించాలనే ఆసక్తి లేదా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను అధిక శరీర బరువు ఉన్నారని శరీర బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజమో, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో బాలకృష్ణ తెలియజేయాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…