తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సుపరిచితమే. ఈ నా జబర్దస్త్ షో లో తనదైన కామెడీ పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఒకవైపు జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ, మరొకవైపు ఢీ షోలో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.
చాలామంది జబర్దస్త్ షోను హైపర్ ఆది స్కిట్స్ కోసం చూస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హైపర్ ఆది వేసిన పంచులు ఎవరైనా కడుపుబ్బ నవ్వాల్సిందే. కొన్నిసార్లు హైపర్ ఆది డబల్ మీనింగ్ పంచులు కూడా వేస్తుంటారు. ఈ సందర్భంలోనే ఈ సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆది పై ట్రోలింగ్స్ చేస్తుంటారు నెటిజన్లు. జబర్దస్త్ షో కమెడియన్స్ నుంచి అనసూయ, జడ్జి రోజా వరకు ప్రతి ఒక్కరి పై కౌంటర్లు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు.
హైపర్ ఆది పంచులకు సుడిగాలి సుదీర్ తోడైతే ఇక అంతే సంగతులు. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో హైపర్ ఆది సంపాదనపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది సంవత్సరానికి కోటి రూపాయల దాకా సంపాదిస్తాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జబర్దస్త్, మరొకవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా పలు చూడ లో పాల్గొంటూ బాగానే సంపాదించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
హైపర్ ఆది ఎంత సంపాదించాడు, అతడికి రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది అన్నా విషయాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. హైపర్ ఆది సంపాదన ఏడాదికి కోటి దాటిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల ఒక ఈవెంట్లో తాను తన ఊరిలో కొన్ని ఎకరాలు కొనుగోలు చేసినట్లు హైపర్ఆది స్వయంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…