ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కరోనా పుట్టినిల్లు అయిన వ్యూహన్ లో కోవిడ్-19 మృతుల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారికంగా ప్రకటించింది.. అయితే మొన్నటి వరకు వ్యూహన్ లో ప్రకటించిన మరణాలకంటే 50 శాతం అధికంగా అంటే 1290 మృతులను అదనంగా వెల్లడించారు. దీనితో ఇప్పటి వరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 4,632 కు చేరింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరోనా విషయంలో మిగిలిన దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. ఈ కారణంతోనే WHO కు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు ట్రంప్. అయితే తాజాగా WHO పనితీరుపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా కరోనా మృతుల సంఖ్యా ఒక్కసారిగా పెంచింది. కోవిడ్-19 మృతుల సంఖ్య అమెరికా కంటే చైనాలో ఎక్కువే ఉంటుంది కానీ ఆ వాస్తవాన్ని చైనా కప్పిపుచ్చింది అని మండి పడ్డారు. కరోనా మరణాల విషయంలో చైనా దరిదాపుల్లో కూడా అమెరికా ఉండదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…