Categories: FeaturedGeneral News

30 రోజులు ఖర్చు పెట్టకుండా ఉండగలరా?

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఆన్లైన్ సంస్థలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆఫర్లను చూడగానే కొందరు ముందు వెనుక ఆలోచించకుండా ఆ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.ఆ వస్తువులు అవసరం మనకు ఉన్నా లేకున్నా చాలామంది వాటిని వెంటనే ఆర్డర్ చేయడం ఒక అలవాటుగా ఉంటుంది.ఈ విధమైనటువంటి అలవాటు ఒకసారైతే ఫర్వాలేదు కానీ ఇది క్రమంగా అలవాటు పడితే భవిష్యత్తులో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మనం నెలకు ఎక్కువ మొత్తంలో అంటే 70, 80 వేల వరకు సంపాదిస్తూ ఉంటే వాటిలో కొంత మొత్తాన్ని మన విలాసాల కోసం ఖర్చు పెట్టుకోవడం సర్వసాధారణమే. కానీ ఇదే క్రమంగా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ 30 రోజుల ప్రణాళిక. 30 రోజుల ప్రణాళిక మనకు అనవసరమైన ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణను కూడా నేర్పుతుంది.

మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని భావించినప్పుడు ఆ వస్తువును వెంటనే కొనకుండా ఒక 30 రోజులపాటు ఆ వస్తువులు కొనడానికి వాయిదా వేయాలి. ఈ విధంగా 30 రోజులు వాయిదా వేసిన తర్వాత కూడా ఆ వస్తువు అవసరం మనకు ఉండి దానిని కొనాలి అనిపిస్తే అప్పుడు ఆ వస్తువులు కొనాలి. లేకపోతే అది అంతటితో మర్చిపోవాలి.

కొన్నిసార్లు మనం ఆవేశంతో కొన్ని వస్తువుల ఉపయోగం మనకు పెద్దగా అనిపించదు.ఆ వస్తువును కొనాలనే ఆలోచన కేవలం అప్పటికి మాత్రమే రావడం వల్ల దానిని కోరకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటాము. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మీరు కొనాలనుకునే వస్తువుకు సరిపడా డబ్బులను తీసి పక్కన పెట్టాలి.30 రోజుల తర్వాత కూడా మీకి ఆ వస్తువు అవసరం ఉన్నప్పుడు పక్కన ఉంచిన డబ్బులను తీసుకొని వాటిని కొనుగోలు చేయాలి. లేదా మీకు ఏమి అవసరం లేదనుకుంటే ఆ డబ్బును మీ భవిష్యత్తు ప్రణాళిక కోసం ఉపయోగించాలి.ఈ విధమైనటువంటి 30 రోజుల ప్రణాళిక మీరు అలవర్చుకుంటే కాలక్రమేణా మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు ఆర్థిక అభివృద్ధిలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago