Navya swami: ప్రదీప్ షో లో గాయపడిన బుల్లితెర నటి నవ్య స్వామి.. ప్రోమో వైరల్!
Navya swami:ప్రస్తుత కాలంలో బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ తో పాటు వివిధ కార్యక్రమాలకు ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వివిధ రకాల షోలువస్తున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సూపర్ కార్యక్రమం ఒకటి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది బుల్లితెర నటీనటులు పాల్గొని ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నవ్యస్వామి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భాగంగా ఆమె చేతికి పెద్ద ఎత్తున దెబ్బ తగిలి రక్తం కారుతోంది.
సెమీ ఫైనల్స్ కి చేరుకున్న సూపర్ క్వీన్ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లు వారి మోచేతులతో కూల్ డ్రింక్ టిన్స్ పగలగొట్టాలి. ఈ విధంగా ఈ టాస్క్ లో పాల్గొన్న కొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
మోచేతి తో కూల్ డ్రింక్ టిన్స్ పగలగొట్టే సమయంలో బుల్లితెర నటి నవ్య స్వామి అలాగే భాను చేతులకి గాయాలయ్యాయని తెలుస్తోంది.ఈ ప్రోమోలో భాగంగా వీరి మోచేతికి అలాగే వేళ్ళ మధ్యలో నుంచి రక్తం కారుతున్నట్టు చూపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే ఈ ప్రోమో లో చూపించిన విధంగా వీరి చేతికి గాయాలు అయ్యాయా లేకపోతే ఈ కార్యక్రమంపై అంచనాలు పెంచడం కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…