RRR Movie: రాజమౌళి సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేసిన శివరాజ్ కుమార్…కారణం అదేనా?
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది అభిమానులు సెలబ్రిటీలు సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అలాగే మరికొందరు ఈ సినిమా గురించి కాస్త నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇకపోతే కన్నడనాట ప్రేక్షకుల నుంచి ఆర్ఆర్ఆర్ కి చేదు అనుభవం ఎదురయింది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా కన్నడనాట సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాపై శివ రాజ్ కుమార్ అలా అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… తన సోదరుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. ఈ సినిమా కన్నడలో విడుదలై అద్భుతమైన కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు పది రోజులు అవుతున్నప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సమయంలోనే రాజమౌళి సినిమా విడుదల కావడంతో కన్నడనాట సుమారు 270 థియేటర్లలో జేమ్స్ సినిమాను తీసేశారు.
ఈ విధంగా పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా తొలగించడంతో శివ రాజ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిలిం ఛాంబర్ ని కలిసి ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతున్న సినిమాని ఎలా తొలగిస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై కన్నడ ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిక్బలాపూర్ లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి, సినీ నటుడు శివరాజ్ కుమార్ ను ఆహ్వానించారు. ఇలా వీరందరినీ ఆహ్వానించడంతో కన్నడలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు. అయితే ఇలా అత్యధిక థియేటర్లలో సినిమాని తొలగించడంతో ఈ సినిమాకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…