భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్‌కు బ్లూటిక్ ను పునరుద్ధరించింది ట్విటర్. అకౌంట్ వాడుకలో లేదంటూ వెరిఫైడ్ సింబల్ ను తొలగించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ సంస్థ పునరుద్ధరించింది. అసలు విషయానికి వస్తే గతేడాది జులై నుంచి అకౌంట్ వాడుకలో లేదంతో శనివారం ఉదయం వెరిఫైడ్ అకౌంట్‌ను సూచించే బ్లూటిక్‌ను తొలగించింది ట్విటర్.
ట్విటర్ చేసిన ఈ పనిపై అన్ని వైపులా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనితో దిగి వచ్చింది ట్విటర్. ఈ మధ్యకాలంలో అధికార ఖాతాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వెంకయ్యనాయుడు. అందువల్ల వ్యక్తిగత ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నదని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఈ నేపద్యంలో వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్‌కు బ్లూటిక్ తొలగించడంపై తీవ్రంగా ప్రశ్నించారు నెటిజన్లు. ఏళ్లకు ఏళ్ళు కొన్ని ఖాతాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా పట్టించుకోని ట్విట్టర్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్ కి మాత్రమే బ్లూటిక్ ఎందుకు తొలగించారని ప్రశ్నిచారు. మరోవైపు ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అంటూ బీజేపీ నేత సురేశ్ నకువా కూడా విమర్శలు గుప్పించారు..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…