Featured

Megastar Chiranjeevi : చిరంజీవితో హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత ఆయనకు తల్లి పాత్రలో నటించింది ఎవరు.?!

Megastar Chiranjeevi : అవకాశాలను అందిపుచ్చుకొని హీరోయిన్ గా తమ సత్తా చాటి వయసు మళ్లిన తర్వాత అదే హీరోలకి తల్లి పాత్రలో నటించిన వారు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి కోవలోకే చిరంజీవి తో చేసిన ఓ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. వారు ఒకప్పుడు చిరంజీవితో చిందులేసి పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనకు తల్లి పాత్రలో చేశారు.

1979 కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది కథ కాదు. ఈ సినిమాలో చిరంజీవి, జయసుధ భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత 1986లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగధీరుడు చిత్రంలో జయసుధ, చిరంజీవి కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. కట్ చేస్తే… 1995లో క్రాంతికుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు చిత్రంలో చిరంజీవికి కి తల్లి పాత్రలో జయసుధ నటించింది.

1980లో చిట్టి బాబు దర్శకత్వంలో లో ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, సుజాత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత 1982లో ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన సీతాదేవి చిత్రంలో సుజాత చిరంజీవికి చెల్లెలిగా నటించింది. కట్ చేస్తే.. 1995లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవికి జోడిగా రోజా నటించగా ఆయనకు తల్లి పాత్రలో సుజాత నటించారు.

విచిత్రమేంటంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, జయసుధ, సుజాత నటించారు. మరో విచిత్రమేమంటే సుజాత, జయసుధ చిరంజీవికి తల్లి పాత్రలో నటించిన రెండు చిత్రాలు (బిగ్ బాస్, రిక్షావోడు) 1995 లోనే విడుదల కావడం ఓ విశేషం.

telugudesk

Recent Posts

తిరుమలలో కొత్త అనుభవం.. భక్తులకు వీఆర్ ద్వారా శ్రీవారి దర్శనం!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే సమయం కూడా ఎక్కువవుతోంది.…

4 minutes ago

“ఆర్టిస్టులు నేరస్తులా?”.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్

సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర…

8 minutes ago

ఆలయ దర్శనంతో సందడి చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో భక్తి వాతావరణం నెలకొంది. గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో తాజాగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయం…

17 minutes ago

పెరుగు మంచిదా? మజ్జిగ మంచిదా? నిపుణుల క్లారిటీ

వేసవి కాలం మొదలైతే మన శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలపై అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ అనే…

38 minutes ago

“మా రాజధాని అమరావతి”.. గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్న బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామాల మధ్య నటుడు, ప్రజాప్రతినిధి నందమూరి బాలకృష్ణ భావోద్వేగ స్పందన వ్యక్తం చేశారు. అమరావతికి…

1 hour ago

పేలుడుతో చిద్రమైన ఇల్లు.. ఇద్దరు పిల్లలు బలి

మణిపూర్ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక నివాస గృహంపైకి అనుమానాస్పదంగా రాకెట్ దూసుకువచ్చి పేలడంతో…

2 hours ago