అవకాశాలను అందిపుచ్చుకొని హీరోయిన్ గా తమ సత్తా చాటి వయసు మళ్లిన తర్వాత అదే హీరోలకి తల్లి పాత్రలో నటించిన వారు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి కోవలోకే చిరంజీవి తో చేసిన ఓ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. వారు ఒకప్పుడు చిరంజీవితో చిందులేసి పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనకు తల్లి పాత్రలో చేశారు.

1979 కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది కథ కాదు. ఈ సినిమాలో చిరంజీవి, జయసుధ భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత 1986లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగధీరుడు చిత్రంలో జయసుధ, చిరంజీవి కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. కట్ చేస్తే… 1995లో క్రాంతికుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు చిత్రంలో చిరంజీవికి కి తల్లి పాత్రలో జయసుధ నటించింది.

1980లో చిట్టి బాబు దర్శకత్వంలో లో ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, సుజాత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత 1982లో ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన సీతాదేవి చిత్రంలో సుజాత చిరంజీవికి చెల్లెలిగా నటించింది. కట్ చేస్తే.. 1995లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవికి జోడిగా రోజా నటించగా ఆయనకు తల్లి పాత్రలో సుజాత నటించారు.

విచిత్రమేంటంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, జయసుధ, సుజాత నటించారు. మరో విచిత్రమేమంటే సుజాత, జయసుధ చిరంజీవికి తల్లి పాత్రలో నటించిన రెండు చిత్రాలు (బిగ్ బాస్, రిక్షావోడు) 1995 లోనే విడుదల కావడం ఓ విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here