చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలు, చిత్రాలు, వీడియోల కోసం ఇంటర్‌నెట్‌లో వెతికారంటే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. గూగుల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కీ వర్డ్స్ తో సెర్చ్ చేసినా, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వెబ్‌సైట్లలోకి వెళ్లినా వెంటనే ఈ సెల్ ఐపీ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ ని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన ఐపీలను వివిధ రాష్ట్రాల్లోని సీఐడీ విభాగానికి తరలిస్తున్నారు.
అక్కడి నుంచి ఆ ఐపీకి సంబంధించిన మెట్రో నగరాలు, పట్టణాలు, పల్లెలకు సెర్చ్ చేసిన చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని పంపించి, నిందితులను పట్టుకుంటున్నారు. ఈవిధంగా లేటెస్ట్ గా హైదరాబాద్ లోని ఇద్దరు యువకులను సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ మోహన్ రావ్ బృందం అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. అశ్లీల వెబ్‌సైట్లలోకి వెళ్లి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్ చేశాడు, వాటిని తన ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేసుకున్నాడు. అలాగే కాచిగూడకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈమధ్యనే MBA పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అశ్లీల వెబ్ సైట్లలోకి వెళ్లి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అశ్లీల ఫోటోలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసి వాటిని ఇతర సైట్లలో అప్ లోడ్ చేశాడు. వీళ్ళిద్దరూ సెర్చ్ చేసిన ఐపీలను రికార్డ్ చేసిన NCRB వాటిని రాష్ట్ర CID కి పంపించింది. ఆ సమాచారం హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందడంతో ఐపీ అడ్రస్ ల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదేవిధంగా మరో 12 మందికి సంబంధించిన ఐపీలపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచ వ్యాప్తంగా నిషేధించబడింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఇంటర్ నెట్‌లో సెర్చ్ చేసే వారికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో NCRB కి ఇతర దేశాలు కూడా తమ తమ సహాయ, సహకరాలను అందిస్తున్నాయి. ఇంటర్ నెట్ ను ఎక్కువగా వాడేవారు ఈ కీవర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే సైబర్ క్రైమ్ క్రింద పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…