Categories: FeaturedMovie News

కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న R.R.R చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్య !!

దేశ వ్యాప్తంగా ప్రజలందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మహమ్మారి టాలీవుడ్ ప్రముఖులను సైతం వదలడం లేదు. తెలుగు సినిమా రంగం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికీ, అతని కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ హాస్య నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్నారు. దర్శకుడు తేజ, కమెడియన్ పృథ్వీలకు కూడా కరోనా సోకింది. అలాగే ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, స్మిత కూడా కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. లేటెస్ట్ గా మరో సినీ పెద్ద ఈ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారని తెలిసింది. ‘RRR’ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. హోమ్ క్వారంటైన్ లోనే ఉండి ఆయన కోలుకుంటున్నారు.

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ NTR లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘R.R.R’ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పుడు ఈ చిత్ర దర్శక, నిర్మాతలిద్దరూ కరోనా బారిన పడడంతో RRR సినిమా పనులు ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నారు. ఈవిషయం తెలిసిన టాలీవుడ్ సినీ పెద్దలు ఆయనకి ఫోన్‌ లు చేసి పరామర్శిస్తున్నారు. ‘R.R.R’ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఇప్పటికే చరణ్‌ పుట్టిన రోజుకి ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రం యూనిట్. ఈ టీజర్‌లో రామ్‌ చరణ్‌ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు.

ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలున్నాయి. ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కుల్దీప్‌. ‘R.R.R’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. మరో ప్రక్క దానయ్య తన కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తన కొడుకు కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారట. అయితే ఈ చిత్రాన్ని తాను నిర్మించకుండా మరొకరి నిర్మాణంలో చేయాలనీ నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నాడట. వీలైనంత త్వరగా కరోనా బారినుండి మన టాలీవుడ్ ప్రముఖులందరూ కోలుకోవాలని కోరుకుందాం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago