ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ మూలంగా మళ్ళీ మొదలైన బుల్లితెర సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. కరోనా లాక్ డౌన్ టైంలో తెలంగాణా ప్రభుత్వం నుండి షూటింగ్ లకు అనుమతులు లభించినా షూటింగ్ చెయ్యలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే తాజాగా బుల్లితెర మీద బిగ్ రియాలిటీ షో కూడా కరోనా ఎఫెక్ట్ కి బలయ్యేలా ఉందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఒకేచోట కంటెస్టెంట్స్ ని పెట్టి షోను నిర్వహించడం ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో జరిగే పని కాదు. కాబట్టి ఈ ఏడాది బిగ్ బాస్ ఆగస్ట్ నాటికీ మొదలైతే ఓకే.. లేదంటే లేదు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని.. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా రెడీ అయ్యింది అని… కాకపోతే బిగ్ బాస్ సీజన్ 4 లో భారీ మార్పులు ఉండబోతున్నాయని షో నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో ఈసారి 100 రోజులు ఉండదని, దానిలో సగం అంటే కేవలం ఈ షో 50 రోజులే వుండే విధంగా డిజైన్ చేసారని, అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ ల విషయంలో కూడా భారీ మార్పులు చేయబోతున్నారని, గతం మాదిరి ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లోను కోత పెట్టారని..ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కేవలం 12 మందే ఉండబోతున్నారని తెలియ జేస్తున్నారు.
గతంలో 14 నుండి 17 మంది కంటెస్టెంట్స్ ఉండేవారు. సామాజిక దూరం పాటిస్తూ ఉండే టాస్క్ లను షో కోసం డిజైన్ చెయ్యడంతో పాటుగా… ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో బాత్ రూమ్, అలాగే ఒక్కో వాషింగ్ మేషన్ తో పాటుగా.. పడుకునే బెడ్స్ దూరం కూడా పెంచబోతున్నారట. సెట్ సెటప్ ఎప్పుడో పూర్తైనా… ప్రస్తుత బిగ్ బాస్ హౌస్ లో మార్పులు కీలకం ఉంటున్నాయని, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యే కంటెస్టెండ్ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని యాజమాన్యం చెబుతుండటం విశేషం. చూద్దాం.. ఇన్ని భారీ మార్పులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 షో ఎలా వుంటుందో..?!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…