Featured

Uday Kiran : ఉదయకిరణ్ తో సినిమా ఆపేయాలని మెగా కాంపౌండ్ నుండి బెదిరింపులు… వైరల్ అవుతున్న నిర్మాత చెప్పిన విషయాలు…!

Uday Kiran : లవర్ బాయ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమాతో కెరీర్ ని ప్రారంభించి వరుసగా మొదటి మూడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభం లోనే వరుస విజయాలు అందుకున్న అతి కొద్దిమంది హీరోలలో ఒకరుగా, హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా కమల్ హాసన్ తరువాత ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న యువ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన ఉదయ్ కెరీర్ లో కలుసుకోవాలని సినిమా తరువాత వచ్చిన ‘శ్రీరామ్‌`, `హోళీ`, `నీ స్నేహం`, `నీ జోడి` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో ఆర్థిక కష్టాలు.. పెళ్లి.. పోషణ.. ఇలాంటి కారణాలతో డిప్రెషన్ లోకి వెళ్లి 2013లో సూసైడ్ చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమని కలచివేసింది. ఈ విషయాలే ఇప్పటికీ ప్రచారంలో ఉన్నా, జూన్ 26 ఉదయకిరణ్ 42వ జయంతి సంధర్బంగా అభిమానులు ఆయనని తలుచుకోవడమే కాక కొన్ని ఆసక్తికర విషయాలు, వీడియో క్లిపులను వైరల్ చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ కెరీర్ అయిపోయిందని అప్పుడే ఫిక్స్ అయ్యా…

ఉదయ్‌ కిరణ్‌కి సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి, పూర్తిగా ఆగిపోవడానికి మెగాస్టార్ చిరంజీవినే కారణమని అప్పట్లో అనేక రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్‌ అయ్యాయి. చిరంజీవి తన కూతురితో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసినందుకు కక్షతోనే ఇలా చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉదయకిరణ్ జయంతి సంధర్బంగా ఇప్పుడు మరోసారి అప్పటి క్లిప్‌ వైరల్‌ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

ఏ ఎం రత్నం ఉదయకిరణ్ తో రెండు బాషలలో ఒక సినిమా 80 శాతం పూర్తిచేయగా, అప్పటిలో ఆ సినిమా చిరంజీవి, అల్లు అరవింద్ బెదిరించడం వలన ఆగిపోయింది అని, అల్లు అరవింద్ కాకుండా ఇండస్ట్రీలో ఇంకా నలుగురు నిర్మాతలు ఎలా చెబితే అలాగే జరుగుతుంది అని వాళ్ళని కాదని ఏం జరగదని, అపుడే అనుకున్నా ఉదయ్ కిరణ్ కెరీర్ అయిపోయింది అని ఆయన హైదరాబాద్లో ఒక ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు సన్నిహితులతో ఏ ఎం రత్నం చెప్పారట. అప్పట్లో అది వార్త పత్రికలో వచ్చింది. అప్పట్లో వచ్చిన వార్త ఇపుడు సామాజిక మద్యమంలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇపుడు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఈ వార్త నెట్ లో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago